భారతదేశంలో పేరుకు అధ్యక్షుడు ఉంటారు కానీ అధికారాలనీ ప్రధానికే ఉన్నాయి. పార్లమెంట్ కి జవాబుదారిగా ప్రధాని ఉంటారు. అపరిమితమైన, విస్త్రుతమైన  అధికారాలు ప్రధాని  చేతుల్లో ఉండడం వల్ల దేశ అధ్యక్షుడు కేవలం ఆయన నిర్ణయాలను  ఆమోదం తెలిపేందుకు అన్నట్లుగా ఉన్న వ్యవస్థ‌ మనది. దాని సమూలంగా మార్చేసేందుకు బీజేపీ వ్యూహ రచన చేస్తోంది.


ఇపుడున్నది  బ్రిటిష్ తరహా పార్లమెంటరీ వ్యవస్థ.  అంటే. అధ్యక్షుడు అలంకార ప్రాయం. ప్రధాని సర్వ శక్తిమంతుడు. దాన్ని తిరగరాయాలని, దేశానికి కొత్త అధ్యక్షుడు ఎలా ఉంటాడో  చూపించాలని మోడీ ఉవ్విళ్ళూరుతున్నట్లుగా కొన్ని కధనాలు వస్తున్నాయి. ఇదెంతవరకూ నిజమో తెలియదు కానీ అందుకోసమే 2022లో జమిలి ఎన్నికలకు మోడీ వెళ్తున్నారని కూడా చెబుతున్నారు.


దేశమంతటా ఒకే ఎన్నికల విధానాన్ని తీసుకురావాలన్న అజెండా వెనక అధ్యక్ష తరహా పాలనని ప్రతిష్టించాలన్న వ్యూహం దాగుందని అంటున్నారు. అత్యంత శక్తివంతమైన అధ్యక్షుడిగా మోడీ  ఉంటారన్న మాట. అంటే డైరెక్ట్ గా అధ్యక్ష పదవికే ఎన్నికలు జరిపించడం ద్వారా జనం నుంచి నేరుగా అత్యున్నత పదవిని అందుకోవాలని మోడీ బలంగా అడుగులు వేస్తున్నారుట. దీనికి ముందు దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరిపిస్తారని తెలుస్తోంది. ఆ తరువాత అధ్యక్ష పదవికి డైరెక్ట్ ఓటింగ్ అవకాశం ప్రజలకే ఇస్తారు. ఆ పదవికి మోడీ పోటీ పడతారు.


ఆ విధంగా ఆయన అధ్యక్షుడుగా, అమిత్ షా ప్రధానిగా ఉండేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారని అంటున్నారు. అధ్యక్ష పాలనా వ్యవస్థలో ప్రధాని సైతం ఆయన నియంత్రణలోనే పనిచేయాల్సిఉంటుంది. గతంలో వాజ్ పేయ్ హయాంలో కూడా అధ్యక్ష తరహా పాలనపై ఓసారి చర్చ జరిగింది. అంతకు ముందు  ఇందిరాగాంధి టైంలో కూడా ఈ విధమైన చర్చ జరిగింది. అయితే ఇపుడు అన్ని విధాలుగా రాజకీయ వాతావరణం అనుకూలంగా ఉండడంతో మోడీ, బీజేపీ ఆలోచనలు చేస్తున్నారని అంటున్నారు.


అసలు ఆరెసెస్ విధానం కూడా ఇదే, అధ్యక్ష  తరహా పాలన ద్వారా దేశంలో తిరుగులేని అధికారాన్ని ప్రెసిడెంట్ కి ఇవ్వడం ద్వారా  తాము కోరుకున్న తీరున దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళవచ్చునని, రాజకీయ అవాంతరాలు, అడ్డంకులు లేకుండా చూడవచ్చునని భావిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: