‘పవన్ కల్యాణ్ పేరు వింటేనే వైబ్రేషన్స్ వస్తాయి’ ఇది ప్రేక్షకాభిమానుల్లో ఉన్న మాట. ‘పవన్ కల్యాణ్ తలచుకుంటే పోరాటాలకు వెరవడు’ ఇది రాజకీయాల్లో వినిపించే మాట. పార్టీ పెట్టిన ఈ ఐదేళ్లలో రాష్ట్రంలోని అనేక సమస్యలపై పవన్ తన గళం వినిపించాడు. పవన్ ఏదైనా సమస్యపై తన గళం వినిపించగానే గత టీడీపీ ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేయడం చూశాం.

 


ఇప్పుడు అధికారం టీడీపీ నుంచి వైసీపీకి వచ్చి అనేక మార్పులు జరుగుతున్నాయి. అందులో ప్రధానమైనది ఏపీ రాజధాని అమరావతి నుంచి దొనకొండకు మారబోతోందనే వార్త. దీంతో ఉలిక్కిపడ్డ ఓ పార్టీ అనుకూలురు, రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఉద్యమం చేసే సన్నాహాల్లో ఉన్నారు. ఇందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిసి తమ పోరాటానికి మద్ధతిచ్చి రాజధాని అమరావతి నుంచి దొనకొండకు మరలకుండా చూడాలని కోరారు. స్పందించిన పవన్ రాజధానిలో ఈ నెల 30, 31 తేదీల్లో పర్యటిస్తానని ప్రకటించి.. రాజధాని అమరావతిలోనే ఉండాలని స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. కానీ, ఇదే రాజధాని రైతులు గతంలో.. ‘రైతుల వద్ద నుంచి బలవంత భూసేకరణ వద్దు’ అని టీడీపీ ప్రభుత్వాన్నుద్దేశించి అన్నందుకు పవన్ పై తిరగబడ్డారు.. నినాదాలు చేశారు.. ప్రెస్ మీట్లు పెట్టి పవన్ పై వ్యతిరేక వ్యాఖ్యలూ చేశారు. ఓ సందర్భంలో పవన్ పై రాయి కూడా విసిరారు.

 


పవన్ పిలుపు బలంగా వెళ్తుందనీ, ప్రభుత్వాన్ని తాకుతుందనీ వీరి ఆలోచన. పవన్ పోరాటాలను కానీ, విశాఖ, విజయవాడల్లో చేసిన పోరాటాల్ని కానీ ఎప్పుడూ మొదటి పేజీలో హైలైట్ చేయని దినపత్రికలు మొదటి పేజీలో టాప్ లో ప్రచురిస్తున్నాయి. ఇవేమీ పట్టించుకోని పవన్ మాత్రం ప్రజా క్షేమమే ముఖ్యమంటూ తన నిబద్దతను చాటుకుని రాజధాని రైతుల తరపున పోరాటానికి సిద్ధమవుతున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: