జగన్ సీఎం అయ్యాక అమరావతిపై ఓ స్పష్టమైన నిర్ణయం ప్రకటించడం లేదన్నది టీడీపీ ఆరోపణ. జగన్ కూడా 25 శాతం కంటే తక్కువగా పనులు జరిగిన రాజధాని ప్రాజెక్టులను ఆపేశాడు. రాజధాని ప్రాజెక్టులపై విచారణ తర్వాతే ఓ నిర్ణయం తీసుకుంటా అంటున్నాడు. అయితే ఇదంతా కమ్మ వాళ్లపై కోపం తోనే జగన్ చేస్తున్నాడా..


అవునంటోంది తోక పత్రికగా పేరున్న దిన పత్రిక.. ఆ పత్రిక తన సంపాదకీయంలో ఏం రాసిందంటే...

“ అమరావతి నిర్మాణం వల్ల లాభపడే వారిలో 85 శాతం మంది ఒకే సామాజికవర్గానికి చెందినవారని ఆ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు జగన్మోహన్‌రెడ్డి ఫిర్యాదు చేశారట. బహుశా ముఖ్యమంత్రి మనోగతాన్ని గమనించిన మంత్రి బొత్స తేనెతుట్టెను కదిపారు. ఇప్పుడు ప్రధానమంత్రి వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల విషయానికి వద్దాం.


రాజధానికి 33 వేల ఎకరాల భూములను ఇచ్చిన రైతులలో అత్యధికులు కమ్మ సామాజికవర్గానికి చెందిన వారేనన్నది నిజం. ఆ సామాజికవర్గానికి చెందిన వారే కనుక భూములు ఇవ్వడానికి వారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆమోదం తెలిపారన్న అభిప్రాయం కూడా ఉంది. రెడ్డి సామాజిక వర్గం వారు అధికంగా ఉన్న గ్రామాల్లో భూములు ఇవ్వడానికి నిరాకరించడాన్ని మనం చూశాం.


రాజధాని ప్రకటన తర్వాత రాజధాని భూములను ఎవరెవరో కొనుగోలు చేశారు. వారిలో అన్ని సామాజికవర్గాల వారూ ఉన్నారు. భవిష్యత్తులో ఇంకెవరో అక్కడి భూములను కొనుక్కుంటారు. అదొక సహజ పరిణామం. కడప జిల్లాకు చెందిన జగన్మోహన్‌రెడ్డికి, చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రబాబుకు హైదరాబాద్‌లో ఆస్తులు ఉన్నాయి కదా! అందునా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు సంకుచితంగా కుల కోణంలో ఆలోచించడం ఏమిటి? "


ఇదీ ఓ ప్రముఖ పత్రి కోణం.. మరి జగన్ నిజంగానే కమ్మవాళ్ల కోసమే రాజధాని అభివృద్ధిని పట్టించుకోవడం లేదా.. ?


మరింత సమాచారం తెలుసుకోండి: