దేశంలో దొంగబాబాలు ఎక్కువైపోయారు.  ఎవరు మంచివారో.. ఎవరు చెడ్డవారో తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది.  కొన్నాళ్లపాటు ఏవేవో సాధన చేయడం మాయలు మంత్రాల పేరుతో ప్రజలను ఆకర్షించడం.. భక్తిముసుగులో అనేక అరాచకాలు చేయడం షరా మాములే అయ్యింది.  మంచి వ్యక్తులు అనుకున్న ఎందరో ఇలా మోసాలకు పాల్పడి జైలు ఊసలు లెక్కపెడుతున్నారు.  ఇందులో డేరా బాబా కూడా ఒకరు.  


డేరా బాబా 2017 వ సంవత్సరంలో తన ఆశ్రమంలోని ఓ సాద్విపై అత్యాచారానికి పాల్పడ్డాడు.  అలానే ఓ జర్నలిస్ట్ హత్యకు కూడా కారణం కావడంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.  ప్రసుత్తం ఆయన రోహతక్ లోని జైలులో యావర్జీవ కారాగార శిక్షను విధించింది.  ప్రస్తుతం అయన జైలులోనే ఉన్నారు.  2017 నుంచి జైలు శిక్షను అనుభవిస్తున్న డేరా బాబా రెండుసార్లు పెరోల్ కోసం దరఖాస్తు చేసినా లాభంలేకపోయింది.  కోర్టు అయన దరఖాస్తును తిరస్కరించిన సంగతి తెలిసిందే.  


జైలుకు రాకముందు డేరా బాబా దాదాపు 105 కేజీల బరువు ఉన్నారు. మధుమేహ వ్యాధితో బాధపడుతున్నాడు.  ఇప్పుడు ఆయన బరువు చాలా వరకు తగ్గిపోయింది. దాదాపు 15 కేజీల వరకు బరువు తగ్గారు.  15కేజీల బరువు తగ్గి 18 వేల రూపాయలు సంపాదించాడు.  అదేంటి ఎలా అని షాక్ అవ్వకండి.. అక్కడికే వస్తున్నా.. జైలుకు వెళ్లిన తరువాత అక్కడ అందరూ సమానమే.  ప్రతి ఒక్కరు పనిచేయాల్సిందే.  


ఉదయం నుంచి సాయంత్రం వరకు జైలు అధికారులు సూచించిన పనులు చేయాలి.  ఆలా 2017 నుంచి డేరా బాబా జైలు అధికారులు సూచిన పనులు చేస్తూ.. చమటలు కారుస్తున్నారు. ఇలా అయన పనిచేస్తూ రోజుకు 40 రూపాయల చొప్పున డబ్బు సంపాదిస్తున్నాడు.  ఇప్పటి వరకు మొత్తం 18వేల రూపాయలు సంప్రదించారట.  రోజు ఒళ్ళు వంచి కష్టపడటం వలన దాదాపు 15 కేజీల బరువు కూడా తగ్గిపోయారు.  మొత్తానికి అలా తన కష్టాన్ని నమ్ముకొని డబ్బు సంపాదిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: