తీర ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించింది. కోయంబత్తూరులో హై అలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీలంక నుంచి సముద్ర మార్గంలో తీవ్రవాదులు చొరబడి ఉంటారనే నిఘా వర్గాల హెచ్చరికల మేరకు తమిళనాడులో భద్రతను కట్టుదిట్టం చేశారు. కోయంబత్తూరులో తీవ్రవాదులు చొరబడినట్టు వచ్చిన వార్తలతో అప్రమత్తమైన పోలీసులు అణువణువూ గాలిస్తున్నారు.లష్కరే తొయిబాకు చెందినట్లుగా అనుమానిస్తున్న ఉగ్రవాదులు తమిళనాడు రాష్ట్రంలోకి ప్రవేశించారన్న నిఘా వర్గాల సమాచారంతో భారత నేవి అలర్ట్ అయ్యింది. ప్రముఖ ఆలయాలు, మసీదు, చర్చిలలో బాంబుస్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించింది. కోయంబత్తూరులోని ప్రధాన కూడళ్లలో భారీస్థాయిలో బలగాలను మోహరించిన పోలీసు యంత్రాంగం నగరంతో పాటు శివారు ప్రాంతాల్ని కూడా జల్లెడ పడుతోంది. కోయంబత్తూర్‌ నగరాన్ని ఇతర రాష్ట్రాలతో కలిపే రోడ్లు, రహదారుల్లో వెళ్లే వాహనాలను ఆర్మీ బలగాలు నిశితంగా తనిఖీలు చేస్తున్నాయని పోలీసులు వెల్లడించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఎయిర్‌పోర్టుల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు.




ప్రజలు ఆందోళన చెందవద్దని అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పాకిస్తాన్‌, శ్రీలంకకు చెందిన ఆరుగురు తీవ్రవాదులు తమిళనాడులోకి చొరబడి ఉంటారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం, పాకిస్తాన్ భారతదేశంపై ప్రత్యక్ష దాడి చేసే స్థితిలో లేదు, కాబట్టి ఇది భారతదేశంపై ప్రతీకారం తీర్చుకోవడానికి చైనా సహాయం కోరుతోంది. భారతదేశంలో ఉబ్బసం వ్యాప్తి చెందడానికి, ఒక ప్రత్యేకమైన బాణసంచా తయారు చేశారు. ఇది అధిక విషపూరిత కార్బన్ మోనాక్సైడ్ వాయువును కూడా బహిర్గతం చేస్తుంది, శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఇంకేముంది, ప్రత్యేకమైన ఫాన్సీ ఎలక్ట్రిక్ లైట్లు భారతదేశంలో అమ్ముడవుతున్నాయి, పెద్ద మొత్తంలో పరాన్నజీవులు కంటికి జోడించడం వల్ల కంటికి తీవ్రమైన సమస్యలు వస్తాయి. 



గుజరాత్ సముద్ర తీరంలో పాకిస్థాన్‌కు చెందిన రెండు పడవలు కనిపించాయి.గుజరాత్‌లోని కచ్‌ జిల్లాకు సమీపంలో గల హరామి నాలా ప్రాంతంలో పాక్‌కు చెందిన 2 మత్స్యకారుల పడవలను సరిహద్దు భద్రతాసిబ్బంది శనివారం గుర్తించారు. అవి అనుమానాస్పదంగా ఉండటంతో తనిఖీలు చేపట్టారు. కచ్ జిల్లా హరామి నాలా ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న మత్స్యకార పడవలను భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. పడవల్లో అనుమానాస్పద వస్తువులేవీ కనిపించకపోయినా లోతైన దర్యాప్తు నిర్వహించాలని భద్రతా బలగాలు నిర్ణయించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: