స‌మాజాన్ని కులాలే నాశ‌నం చేస్తున్నాయి. అస‌లు రాజ‌కీయాల‌కు కులాల‌కు సంబంధం ఏంటి? అంటూ పెద్ద ఎత్తున పేరాల‌కు పేరాలు దంచి కొట్టే.. రాష్ట్రంలోని ఓ ద‌మ్మున్న మీడియా అధినేత‌.. తాజాగా మ‌రోసా రి వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రంలో టీడీపీ మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని అనుకున్న వారు ఎంద‌రో ఉన్నా.. వారందిలోనూ.. ఈయ‌న మాత్రం చాలా డిఫ‌రెంట్ గురూ! అని అనిపించుకున్నారు. త‌న మీడియాలోను, పేప‌ర్‌లోనూ ఆయ‌న టీడీపీకి ఓట్లేయాల‌ని ప్ర‌జ‌ల‌కు శోక‌ణ్నాలు పెట్టి మ‌రీ వేడుకున్నారు. అయితే, అనుకున్న‌ది జ‌ర‌గ‌లేదు. దీంతో టీడీపీ నేత‌లైనా.. త‌మ పార్టీ మ‌ళ్లీ గెలుస్తుంద‌న్న ధైర్యంతో నిభాయించుకున్నారు. 


కానీ, ఈయ‌న మాత్రం నిభాయించుకోలేక పోతున్నారు. పార్టీ ఇంకా అధికారంలో ఉంద‌నే భ్ర‌మ‌లోనే ఈయ‌న కాలం గ‌డిపేస్తున్నారు. ఇంత జ‌రిగినా.. ఆయ‌న కులాన్ని ప‌ట్టుకుని వేలాడుతున్నారు. కుల‌మో రామ‌చంద్రా .. అంటూ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఆయ‌న రాసిన శీర్షిక‌లో.. అమ‌రావ‌తిపై ప్ర‌భుత్వం క‌క్ష గ‌ట్టింద‌ని, ఇక్క‌డ కుల రాజ‌కీయాలు చేస్తోంద‌ని , అమ‌రావ‌తిలో క‌మ్మ సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉండ‌డం, ఇక్క‌డి రైతులు ఎక్కువ మంది వారే కావ‌డం క‌మ్మ‌వారు కాబ‌ట్టే అప్ప‌ట్లో చంద్ర‌బాబుకు స‌హ‌క‌రించార‌ని, జ‌గ‌న్ వీరిపై ఇప్పుడు క‌సి తీర్చుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని పేర్కొంటూ.. పెద్ద ఎత్తున చాట భార‌తం లిఖించారు. 


అయితే, ప్ర‌భుత్వ వాద‌న‌ను చెవిని పెట్టుకున్న కొంద‌రు మేధావులు మాత్రం ఈ వాద‌న‌ను సుత‌రాము ఒప్పుకోవ‌డం లేదు. అస‌లు రాజ‌ధానిపై నియ‌మించిన శివ‌రామ‌కృష్ణ క‌మిటీని ప‌ట్టించుకున్నారా?  లేక చంద్ర‌బాబు త‌న సామాజిక వ‌ర్గానికి న్యాయం చేయాల‌ని భావించారా? ఏ భావ‌న‌తో ఆయ‌న ఇక్క‌డ రాజ‌ధానిని నిర్మాణం చేశారు?  పోనీ.. నాగ‌రిక‌త అంతా న‌దుల వెంటే ఉంటుంద‌ని అంటే.. రాష్ట్ర ప్ర‌జ‌లు అంద‌రూ వ‌చ్చి కృష్ణాన‌ది వెంబ‌డే నివాసం ఉండాలి. కానీ, అలా జ‌ర‌గ‌దు క‌దా?! ఇక‌,ఇదే శీర్చిక‌లో పేర్కొన్న మ‌రో వాద‌న కూడా వాద‌న‌కు చిక్క‌డం లేదు. అదే.. హైద‌రాబాద్‌, ముంబై, చెన్నై నీట మునిగిపోగా లేనిది అమ‌రావ‌తి మునిగితే త‌ప్పేంట‌ని? 


ఎవ‌రూ కూడా చూస్తూ.. చూస్తూ.. గోతులో దూకాల‌ని అనుకోరు. పైగా అధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఞానం అందుబాటులోకి వ‌చ్చాక‌.. ఈ ప‌రిస్థితి మ‌రింత మారింది. తెలిసి తెలిసీ ఎవ‌రూ కూడా ఇంటినే వర‌ద ముంపు ప్రాంతాల్లో క‌ట్టుకోరుకదా? మ‌రి మీరు ఎలా రాజ‌ధానిని స‌మ‌ర్ధిస్తున్నారు?!  ఏదేమైనా.. ఇక్క‌డ కుల రాజ‌కీయాల‌కు తావులేద‌ని జ‌గ‌న్ అంటుంటే.. దీనిని విడిచి పెట్టి.. ఏదొ ఒక‌ర‌కంగా ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌ను పెంచేందుకు జ‌రుగుతున్న క‌మ్మ‌టి వ్యూహంలో ఇదో ప్ర‌ధాన ఎత్తుగ‌డ‌మాత్ర‌మే., రాజ‌దాని ఎక్క‌డుంద‌నేది సామాన్యుల‌కు ప‌నిలేదు. వారికి కావాల్సింది సంక్షేమ ఫ‌లాలు అంద‌డ‌మే. 


మరింత సమాచారం తెలుసుకోండి: