దేశంలో ఇప్పటి వరకు చాలా  మంది పీఎంలు వచ్చారు. కానీ నరేంద్ర మోడీ మాత్రం ఒక సంచలనమని చెప్పాలి. దేశ ప్రజల్లో నిలిచిపోయిన పోయిన బలమైన నేత. ఇప్పటికే దేశంలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. నరేంద్ర మోడీ .. ఇండియాకు ప్రధాన మంత్రిగా ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ రెండో సారి కూడా భారీ మెజారిటీతో అధికారంలోకి రావటం ఒక్క మోడీకే దక్కింది. మోడీకి ముందు పరిపాలించిన కాంగ్రెస్ ..  సంపూర్ణ మెజారిటీని దక్కించుకోలేకపోయింది. సంకీర్ణ ప్రభుత్వాలతో దేశాన్ని పరిపాలించింది. అయితే మోడీ బంపర్ మెజారిటీతో అధికారంలో రావటంతో నోట్ల రద్దు, జీఎస్టి వంటి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.


ఇప్పుడు రెండో సారి ఇంకా భారీ మెజారిటీతో రావటంతో కాశ్మీర్ విషయంలో ఎవరు తీసుకోని నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక్క నిర్ణయం చాలు మోడీ ఆలోచన ధోరణి ఎలా ఉంటుందో.. దేశం కోసం ధైర్యంగా ఎలా నిర్ణయం తీసుకుంటున్నాడో ! నిజానికి మోడీ అధికారంలోకి వచ్చాక ఉగ్రవాదుల విషయంలో దూకుడుగా ఉంటూ, ఎటువంటి చర్యకైనా సిద్దపడుతున్నారు. పఠాన్ కోట దాడులు జరిగినప్పుడు గాని, పుల్వామా దాడులు జరిగినప్పుడు మోడీ తిరిగి పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్ళి మరీ బాంబులు వేసిన ఘనత ఒక్క మోడీకే చెల్లింది.


నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత దైర్యంగా ఎప్పుడు నిర్ణయాలు తీసుకులేదు. ఎప్పుడు ఓట్ల రాజకీయాలు చేస్తూ దేశం గురించి సాహోసోపిత నిర్ణయాలు ఎప్పుడు తీసుకోలేదు. అయితే మోడీ ఎవరు కనీ విరగని ఒక సంచలన నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం వస్తుంది. అదే అధ్యక్ష ఎన్నికలు. మన దేశం పార్లమెంటరీ ఎన్నికలు ఏర్పాటు చేసుకుంది. దీనితో ప్రజలు ఎంపిలను ఎన్నుకుంటారు. కానీ మోడీ లాంటి చరిష్మా ఉన్న నాయకుడు కూడా ప్రతి సారి ఈ పద్ధతిలో గెలవడం కష్టం. అందుకే డైరెక్ట్ గా అధ్యక్షుడిని ఎన్నుకునే సంప్రదాయం తెస్తే మోడీకి ఇక తిరుగే ఉండదు. ఇక పర్మినెంట్ గా మోడీ పీఎంగా నిలిచిపోతారు. ఎందుకంటే మోడీ ఢీ కొట్టే నేత కాంగ్రెస్ లో కూడా లేరు కాబట్టి. 

మరింత సమాచారం తెలుసుకోండి: