రాజకీయ నేతలు అధికారంలోకి రాగానే .. ప్రత్యర్థుల పైన పగ తీర్చుకోవడానికి అధికారాన్ని ఉపయోగించి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతారు. శాశ్వతంగా తామే అధికారంలో ఉంటామని భ్రమలో బతుకుంటారు. ఇప్పుడు చిదంబరంను చూస్తుంటే అలానే అనిపిస్తుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సీబీఐ, ఈడీ తన గుప్పిట్లో పెట్టుకొని అందరి మీద కక్ష తీర్చుకున్నారు. కానీ ఇప్పుడు ఆ దర్యాప్తు సంస్థలే చిదంబరంను తీహార్ జైలుకు తరలిస్తున్నారు. ఈ సూత్రం ఒక్క కాంగ్రెస్ కు మాత్రమే కాదు. ఇప్పుడు బీజేపీకి కూడా వర్తిస్తుంది. ఈ రోజు బీజేపీ అధికారంలో ఉండొచ్చు .. రేపు కాంగ్రెస్ అధికారంలో ఉండొచ్చు. కానీ ఎందుకు రాజకీయ నేతలు ఇంత తెలివి తక్కువగా ఆలోచిస్తున్నారని అర్ధం కావటం లేదు. 


అయితే చిదంబరం పట్ల ఎవరు పెద్దగా సానుభూతి చూపించడం లేదు. ఎందుకంటే అధిరికంలో ఉన్నప్పుడు గర్వంతో ప్రత్యర్థులను ఇలానే జైలుకు పంపించారు. అప్పట్లో ఏపీ సీఎం జగన్ ను 16 నెలలు జైల్లో పెట్టించడంలో చిదంబరంకీలక పాత్ర పోషించాడని ఒక టాక్ కూడా ఉంది. సోనియా గాంధీని ఎదిరించినందుకు రాజకీయంగా జగన్ మీద కక్ష తీర్చుకున్నారు. అయితే ఇప్పుడు అదే చిదంబరంకు ఇప్పుడు జైల్లో చిప్పకూడు తినే రోజు వచ్చింది. చెడపకురా.. చెడేవే అని పెద్దలు ఊరకనే అనలేదు. ఇలాంటి నీచమైన రాజకీయ నేతలు ఉంటారు కాబట్టే ఇటువంటి సామెతలు పుట్టాయి కాబోలు. 


అయితే చిదంబరం 2017 నుంచి తప్పించుకుంటూ ఎన్నో స్టే లు తెప్పించుకున్నారు. చిదంబరం అతని కొడుకు కార్తీ. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చిదంబరం కేంద్ర మంత్రిగా పని చేసిన సంగతీ తెలిసిందే. అప్పుడే చిదంబరం .. కొడుకు కు లభ్ది చేకూర్చాలని పక్క దారిలో విదేశాల నుంచి డబ్బులు ఐఎన్ ఎక్స్ మీడియాలోకి వక్రమార్గంలో నిధులు తరలించారు. స్వతహాగా సుప్రీం కోర్ట్ లాయర్ అయిన చిదంబరం అన్నీ జాగ్రత్తలు తీసుకోని స్కాం చేశారు. కానీ ఎంత జాగ్రత్తగా తప్పు చేసిన ఎక్కడో ఒక చోట దొరికిపోతారు. ఇప్పుడు అలానే చిదంబరం దొరికిపోయారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: