ప్రధాని మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత స్పీడ్ ను పెంచారు.  మొదట త్రిపుల్ తలాక్ బిల్లును తీసుకొచ్చి దాన్ని ఆమోదింపజేశారు.  అనంతరం ఆర్టికల్ 370 రద్దును, జమ్మూ కాశ్మీర్, లడక్ లను కేంద్రపాలిత ప్రాంతాలుగా ఆమోదింపజేయడంలో మోడీ సర్కార్ విజయం సాధించింది. ఎప్పుడైతే ఆర్టికల్ 370 నిరద్దు చేశారో అప్పటి నుంచే మోడీపై పాకిస్తాన్ కత్తులు దూయడం మొదలైంది.  ఇటు ప్రతిపక్షాలు కూడా ఆర్టికల్ 370రద్దును వ్యతిరేకిస్తున్నాయి.  


ఎంతమంది వ్యతిరేకించినా మోడీ ప్రభుత్వం మాత్రం చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ పోతున్నది.  ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తోంది.  ఇందులో భాగంగా ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసేందుకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం.  మోడీఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో సుస్థిర ప్రభుత్వం, దేశ రక్షణ, ఆర్ధికంగా బలోపేతంతో పాటు అధ్యక్షతరహా పాలనా వైపు కూడా ఆలోచిస్తామని హామీ ఇచ్చారు.  


ఈ ఆలోచన ఇప్పటిది కాదు.. పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇలాంటి ఆలోచన ఉన్నది.  పార్లమెంట్ వ్యవస్థకంటే అధ్యక్ష వ్యవస్థ ఉంటేనే సుస్థిరమైన పాలన సాగుతుంది.  ప్రపంచంలో పోటీపడి ఇండియా పరుగులు తీస్తుంది.  ఏ దేశానికీ ఇండియా తీసిపోదు అన్నది బీజేపీ ఆలోచన.  2022 నుంచి దీనిని అమలు చేయాలని బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం.  త్వరలోనే రాజ్యసభలో బీజేపీ బలం మరింతగా పెరిగే అవకాశం ఉన్నది.  పూర్తిస్థాయిలో బలం చేకూరితే.. దీనిపై కూడా నిర్ణయం తీసుకోవచ్చు.  
ఇటీవలే త్రివిధ దళాలకు ఒకరే అధిపతిగా ఉండాలి అని చెప్పిన విధానం కూడా ఈ దిశగా అడుగులు వేయడానికి ఒక సంకేతం అని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.  ఒకవేళ అధ్యక్ష విధానం అమలులోకి వస్తే.. అధ్యక్షుడిగా మోడీ ఎంపికవుతారు.. అందులో సందేహం అవసరం లేదు.  మోడీ అధ్యక్షతన అన్ని నియామకాలు జరుగుతాయి.  ప్రధాని పదవిని కొనసాగిస్తూనే .. అధికారులు మాత్రం అధ్యక్షుడి దగ్గర ఉంటాయి. సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటు కావడం, పాలనలో సుస్థిరత లేకపోవడం వంటివి ఉండవు.  చట్టాలను చేసే అధికారం కేవలం అధ్యక్షుడికి మాత్రమే ఉంటుంది.  అధ్యక్షుడి తరహా పాలన అంటే మొదట మనకు కనిపించేది అమెరికానే. అమెరికాలో ప్రెసిడెన్షియల్ వ్యవస్థ ఉంటుంది. 


అక్కడ అధ్యక్షుడు మాత్రమే ఉంటారు.  ప్రధాని వ్యవస్థ ఉండదు.  సెమి ప్రెసిడెన్షియల్ వ్యవస్థలో అధ్యక్షుడు, ప్రధాని ఇద్దరు ఉంటారు.  అధ్యక్షుడే పరిపాలనాధీశుడు.  అతనిద్వారానే అన్ని పనులు జరగాలి.  రష్యాలో ఈ తరహా పాలనా ఉంటుంది.  


ఒకవేళ ఇండియా అధ్యక్ష తరహా పాలన తీసుకురావాలి అంటే సెమి ప్రెసిడెన్షియల్ వ్యవస్థను తీసుకొచ్చే అవకాశం ఉన్నది.  ఇందులో అధ్యక్షుడు ఉంటాడు.. అలానే ప్రధాని ఉంటాడు.  ప్రస్తుతం దేశరాజకీయాల్లో జరుగుతున్న మార్పులు చూస్తుంటే ఈ తరహా వ్యవస్థ త్వరలోనే వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: