ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక అక్రిడేషన్ పొందటం అంత ఆషామాషీ కాదు. జర్నలిస్టుల కు మంజూరు చేసే ప్రెస్ అక్రిడేషన్ల జారీకి ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్టు విశ్వసనీయమైన సమాచారం. ఈ విషయంలో జర్నలిస్టుల విలువలను పెంపొందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు తీసుకువచ్చేందుకు సమాయత్తమైనట్టు సమాచారం. ప్రధానంగా అక్రిడేషన్ల జారీ పలు సంస్కరణలు తెచ్చేందుకు జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. పరిశీలనాంశాలు ఇలా ఉన్నాయి. అక్రిడేషన్ కమిటీల్లో యూనియన్ల స్థానానికి స్వస్తి. ఒక్క యూనియన్ కూడా సభ్యత్వ నమోదు అప్డేట్ లేదట. ప్రభుత్వం జారీ చేసే అక్రిడేషన్ కమిటీల్లో యూనియన్లు ఎందుకు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఒక్క యూనియన్ లో అయినా ప్రముఖ పత్రికల ప్రతినిధులు ఉన్నారా అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోనున్నట్టు సమాచారం.




ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సర్కులేషన్ ప్రకారం అక్రిడేషన్లు ఇవ్వకుండా విచ్చలవిడిగా జారీ చెయ్యటం. ఆడిటర్ల రిపోర్ట్ల ప్రకారం పత్రికల ప్రచురణ సంఖ్య  చూస్తే ఇళ్లలోనే కాదు వీధులన్నీ పత్రికలతో నిండిపోతాయి. ఒకటి రెండు యూనియన్లు మినహా దేనికి సరైన స్థాయిలో సభ్యత్వాలు లేవు.ఏడు లేదా 9 మంది కలిస్తే యూనియన్ వేలుస్తుంది.ఇప్పడికి ఎన్ని ఉన్నాయో లెక్కలేదు. ఎందుకోసం?ఏమిసాధించాలని దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఈ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లొనే  ఇన్ని యూనియన్లు పుట్టుకొచ్చాయి?ఏమాశించి?. పత్రికలకు నెలకు 60 న్యూస్ క్లిప్పింగ్స్ అడిగే ప్రభుత్వం రెండునెలలకు ఒక స్క్రోలింగ్ రాని ఛానళ్ల విలేకరులకు అక్రిడేషన్లు ఎందుకిస్తున్నట్లు?. పేపర్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని క్రమంగా ప్రచురిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం. ఇది తెలుసుకొనేందుకు ప్రింటర్ల నుండి మూడుమాసాలకు ప్రింట్ చేసిన బిల్లులు,అమ్మినట్లు తెలిపేందుకు అజెంట్లనుండి చెల్లించిన పైకానికి ఆయా మండలాలు,జిల్లాల వారికి ఇచ్చిన రసీదులు నకలు మండల,జిల్లాల విలేకరులు సమర్పించే విధంగానూ నిబంధనలను రూపొందించనున్నారు.




ప్రభుత్వం నుండి ఏవిధమైన సమస్యలు పరిష్కారానికి గుర్తింపు పొందేందుకు సమాచారశాఖే యూనియన్లకు ఎన్నికలు నిర్వహించే ఆలోచన.
అసాంఘిక శక్తులు,తీవ్రనేరాల్లో నగరబహిష్కరణకు గురైనవారు మరో ఊర్లో కూడా తేలిగ్గా ఈరంగం లోకి ప్రవేశించి పవిత్ర పత్రికారంగాన్ని కలుషితం చెయ్యటాన్ని అరికట్టేందుకు పోలీస్ నివేదికలు కోరడం. ప్రతినిత్యం సచివాలయంలో తిరుగుతూ వారేమి చేస్తున్నారు?ఎందుకు వస్తున్నారో గుర్తించి సబ్సిడీ క్యాంటీన్ భోజనం వసతి రద్దు వంటి అంశాలను పరిశీస్తున్నట్టు సమాచారం.
 



రాజధానితో సంబంధం లేకపోయినా అనేకులు కమీషనర్ స్థాయి అక్రిడేషన్లు పొందినవారిలో న్యూస్ తో ఏమాత్రం ప్రమేయం లేని కొన్ని ఛానళ్లు,వార,పక్ష,మాస పత్రికలకు కూడా ఉండటం ప్రభుత్వం పై పెనుభారం నుండి తప్పించటం తోపాటు ఇలాంటి మరిన్ని నిర్ణయాలు రానున్న అక్రిడేషన్ జి.ఓ లో ఎంతో పకడ్బందీగా రూపొందించేందుకు తద్వారా జర్నలిజం విలువలు పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.అడుగులు ఆచి తూచి ప్రక్షాళనకు నిర్ణయించడంతో జి.ఓ కి లేట్ అవుతోందని, అందుకే తిరిగి మళ్ళీ డిసెంబర్ వరకు అక్రిడేషన్ల గడువు పెంచవచ్చని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: