ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో అనేక రూమర్లు వస్తున్నాయి. రాజధాని అమరావతిని మారుస్తున్నారని వార్తలు వస్తున్నాయి.  ఈ వార్తల నేపథ్యంలో అమరావతిలో అనేక గొడవలకు దారి తీసింది.  అమరావతిని మారిస్తే.. సహించబోమంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళన చేస్తున్నారు.  తెలుగుదేశం పార్టీనేతలతో పాటు రాజధాని ప్రాంత ప్రజలు కూడా ఆందోళన చేయడం విశేషం.  


అయితే, రాజధానిని మార్చబోవడం లేదని, బొత్స చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారని, రాజధానిని మార్చే ఉద్దేశ్యం ఎప్పటికి చేయబోమని వైకాపా చెప్తోంది.  అయితే, ఈ విషయంపై కొద్దిసేపటి క్రితమే బొత్సా మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేయడంతో అయోమయంలో పడిపోయారు.  గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు.  అంతేకాదు, అమరావతిలో నిర్మాణాలు జరిపితే.. ఆర్ధికంగా భారం అవుతుందని అన్నారు. 


ఇదిలా ఉంటె, బొత్స చేసిన వ్యాఖ్యలకు ఊతం ఇచ్చేలా కొన్ని వ్యాఖ్యలు చేశారు టిజి వెంకటేష్.. బీజేపీ ఎంపీ టిజి వెంకటేష్ రాజధాని విషయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం విశేషం.  ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఒకటికాదని, నాలుగు రాజధానులు ఉన్నాయని టిజివెంకటేష్ చెప్పడం విశేషం.  కేంద్రం ఇప్పటికే ఈ విషయంపై క్లారిటీగా ఉందని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో కూడా ఈ విషయం గురించి వివరించిందని టిజి వెంకటేష్ అన్నారు.  


విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడపను రాజధానులుగా ఏర్పాటు చేస్తున్నారని అన్నారు.  టిజి వెంకటేష్ చేసిన ఈ నాలుగు రాజధానుల వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి.  ఒక్క రాజధాని విషయమే తేలకుండా ఉన్న ఈ సమయంలో నాలుగు రాజధానుల విషయం తెరపైకి వచ్చే సరికి ఏపీ ప్రజలు షాక్ లో ఉండిపోయారు.  అసలేం జరుగుతుందో అర్ధంకాని స్థితిలో పడిపోయారు ప్రజలు.  మరి దీనిపై వైకాపా స్పందిస్తుందో చూడాలి. 

ఒకవేళ కేంద్రం నాలుగు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొస్తే.. దానివెనుక ఇంకేదైనా మతలబు ఉన్నదా అన్ని ఆలోచించాలి.  నాలుగు రాజధానులు చేసినపుడు.. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ను నాలుగు రాష్ట్రాలుగా ఎందుకు విభజించకూడదు.. ఏమో చెప్పలేం.  


మరింత సమాచారం తెలుసుకోండి: