ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ని కులం పేరుతో దూషించిన టీడీపీ పెయిడ్ జూనియర్ ఆర్టిస్ట్ అయ్యారు. జూనియర్ ఆర్టిస్ట్ అయిన ఇతను సినిమాల్లో నటించకుండా టీడీపీ ప్రచార కమిటీ కార్యదర్శి నారా లోకేష్ డైరెక్షన్ లో నటిస్తాడు.  ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే ఫేక్ వీడియోలలో నటిస్తూ రైతు వేషం వేసి వరదల్లో జగన్  ప్రభుత్వం విఫలమైందంటూ సీఎం వైఎస్ జగన్ , మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లను కులం పేరుతో ఇష్టమొచ్చినట్టు తిట్టిన ఈ నటుడినని శనివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు.



ఒక పథకం ప్రకారం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే ఫేక్ వీడియోలలో ఇతనికి స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారు?,  ఎంత మొత్తంలో చెల్లించారు? అనే విషయాలపై పోలీసులు చేపట్టిన ఇంటరాగేషన్ లో త్వరలో బయటకు వస్తాయని వైఎస్సార్ సీపీ నేతలు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఇలాంటి ఫేక్ వీడియో ల చిత్రీకరణపై పోలీసు నిఘా విధించింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో సీఎం జగన్, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్ అయ్యారు. తాడేపల్లి మండలం ఉండవల్లికి చెందిన తమ్మా శంకర రెడ్డిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టుకి తరలించిన తాడేపల్లి పోలీసులు తనమీద, సీఎం జగన్ మీద  అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ నెల 18వ తేదీన తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి.




అసెంబ్లీని రెడ్ లైట్ ఏరియాతో పోలుస్తూ మహిళా ఎమ్మెల్యేలపై అసభ్యకరమైన పోస్టు పెట్టిన రమేష్ పునుగుపాటిని అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. సీఎం జగన్మోహన్ రెడ్డి పై పోస్టులు పెట్టినా మమ్మల్ని ఎవరూ ఏమీ చెయ్యలేరులే అని కొంతమంది అనుకుంటున్నారని వైకాపా నేతలు వ్యాఖ్యనిస్తున్నారు. ఇదివరకే జగన్ పై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన 86మంది టీడీపీ మరియు జనసేన అభిమానులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: