ఉంటానికి గూడు, తింటానికి తిండి.. కట్టుకోవడానికి బట్ట ఉంటె మనిషి చాలా వరకు సర్వైవ్ అవుతాడు.  ఇవి దొరక్క ప్రపంచంలో కోట్లాది మంది ఇబ్బందులు పడుతున్నారు.  తిండికి లేక ఇబ్బందులు పడుతూ.. ఆకలి చావులు చేస్తున్నారు.  ఉగాండా, రువాండా వంటి దేశాల్లో ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.  స్థలం కావాల్సినంత ఉన్నా.. దానికి తగిన వనరులు లేకపోవడంతో.. ఆకలికి మలమాలమాడిపోతున్నారు.  కనీసం తాగేందుకు నీళ్లు కూడా అక్కడ దొరకవు.  డబ్బు ఉండదు.  ఇలాంటి పరిస్థితులు ఎవరికీ రాకూడదు అని అనుకుంటాం.  


ప్రపంచంలో పట్టణీకరణ, నగరీకరణ పెరగడంతో.. పల్లెటూరిలో ఉండే వ్యక్తులు తగ్గిపోతున్నారు.  పట్టణాల్లో ఉంటూ నానా కష్టాలు పాడటానికి సిద్ధపడుతున్నారే తప్ప.. పల్లెటూరిలో ఉండి దొరికింది తినడానికి మాత్రం ఇష్టపడటం లేదు.  పల్లెటూరిలో ఉండే వ్యక్తు ఇండియాలోనే కాదు ప్రపంచంలో చాలా దేశాల్లో ఇలాంటి పరిస్థితులే ఎదురౌతున్నాయి. 


అయితే, పల్లెటూరిలో ప్రజలు నివసించేలా చేసేందుకు ఓ గ్రామ ప్రజలు వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు.  ఆ నిర్ణయం ఏంటో.. ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం.  అంటికితెర.. ఇది గ్రీస్ దేశంలోని ఓ చిన్న దీవి.  ఈ దీవి చుట్టూ నీరు.. కొండలు.. పచ్చని చెట్లు.. ఇంకా చెప్పాలి అంటే మన సినిమాల్లో కనిపించే అందమైన పల్లెటూరిలా ఉంటుంది.  అలాంటి చోటకు వెళ్తే తిరిగి రాబుద్దికాదు.  పల్లెటూరు కాబట్టి ఎక్కువ రోజులు ఉండలేరు.  


నానాటికి అక్కడ జనాభా తగ్గిపోతున్నది.  ఆ గ్రామాన్ని ఖాళీ చేసి ప్రజలు పట్టణాలకు వెళ్లిపోతున్నారు.  ఇలానే ఇంకొన్నాళ్ళు ఉంటె ఆ దీవి మొత్తం ఖాళీ అవుతుందని గ్రామ ప్రజలు భావిస్తున్నారు.  అందుకోసమే ఓ నిర్ణయం తీసుకున్నారు.  ఎవరైనా సరే ఆ దీవికి వచ్చి అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే.. ఆ దీవిలో ఉండేందుకు అక్కడి ప్రజలు వాళ్లకు ఇల్లు ఫ్రీగా ఇస్తారట.  అంతేకాదు.. మూడు సంవత్సరాల పాటు వాళ్ళ ఖర్చుల కోసం నెలకు నలభైవేల రూపాయలు కూడా ఇస్తారట. 

మూడేళ్ళలోఅక్కడ ఏదైనా సొంతంగా వ్యాపారం చేసుకోవడమో లేదంటే పొలం ఏర్పాటు చేసుకొని పంట పండించుకోవడమో చేసుకోవచ్చు.  కొంతమంది ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. అక్కడ ఉండాలని అనుకుంటే మీరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: