ప్రతిపక్ష నేత మరియు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయిన చంద్రబాబు సందు దొరికినప్పుడల్లా తన పాత క్యాసెట్టు రిపీట్ చేయడం చాలా కామన్ అయిపోయింది. ఎప్పుడూ ప్రస్తుతం ఉన్నా వైఎస్ఆర్సీపీ పాలనలో నొసుగులు వెతుకుదాం అన్న ఒక్క విషయమే ఆయన ధ్యాసలో ఉంది కానీ బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ప్రజలకు ఏం కావాలో మాత్రం ఆయన చేయట్లేదు. తాజాగా వచ్చిన కృష్ణ గోదావరి నదుల వరదల గురించి బాబు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు విశ్లేషకులు దగ్గర తీవ్రమైన విమర్శలు అందుకుంటుంది.

దీనిపై బాబు ఆరోపణ ఏమిటంటే కృష్ణ గోదావరి వరదల విషయంలో ముఖ్యమంత్రి సరిగ్గా వ్యవహరించలేకపోయరట. అతని మాటల్కు ఊతం ఇచ్చేందుకు తన పాలనను ఉదాహరణగా పోల్చి చూపారు. హుద్ హుద్ వచ్చినప్పుడు మరియు తిత్లీ తుఫాను వచ్చినప్పుడు తాము ప్రజలను ముందస్తు హెచ్చరికలతో అప్రమత్తం చేశామని ఆయన తన ట్విట్టర్లో ఒక ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. కానీ ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో జగన్ పభుత్వం విఫలం అయిందన్న బాబు మాటలు పెద్ద బాంబుల లాగా పేలుతాయి అనుకున్నాడు కానీ అవి కాస్త చివరికి తుస్ ఉన్నాయి.

నిజానికి హుద్ హుద్ వచ్చినప్పుడు చంద్రబాబు నిజంగానే చాకచక్యంగా వ్యవహరించి ఉంటే విశాఖ ప్రజల్లో ఆవిశ్వాసం ఎక్కడికి పోతుంది? ఆయన నిజంగానే విశాఖ ప్రజలను ఆదుకునే ఉంటే అక్కడ బాలయ్య మేనల్లుడు లాంటి నాయకుడిని పెట్టిన తరువాత వారు ఎంపీ సీటును కోల్పోయే వారా? తిత్లి తుఫాను సమయంలో బాబు పనితీరు అంత మెచ్చుకోలుగా ఉంటే శ్రీకాకుళం జిల్లా ప్రజలకు కృతజ్ఞతాభావం లేనట్లా? అంత చాకచక్యంగా వ్యవహరించి ఉంటే చంద్రబాబుకి బాసటగా అక్కడి ప్రజలు నిలవరా? 

రెండు జిల్లాల్లో కలిపి పట్టుమని పది సీట్లు కూడా రాలేదు మన తెలుగుదేశం పార్టీ కి. చంద్రబాబునాయుడు ఇలాంటి మాటలు అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా మాట్లాడారు. తాను విపత్తుల సమయంలో ఏదో బ్రహ్మాండంగా డీల్ చేసినట్లు టెక్నాలజీని ఉపయోగించి తుఫాన్లు ఆపినట్టు గొప్పలు చెప్పుకున్నాడు. ఇప్పుడు అవే పాత క్యాసెట్లను వినిపిస్తున్నారు. తను అంతా డాష్ బోర్డ్ నుండే పరిస్థితులను డీల్ చేసినట్లు చెబుతున్న బాబు మాటలు విని విని విసిగిపోయిన జనాలు చివరికి వైసీపీ ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికైనా ఇలాంటి మాటలు మానుకొని ప్రజలమధ్య ఉంటూ మంచి ప్రతిపక్షనేత అనిపించుకుంటే వచ్చే ఎన్నికలకు ఆ హోదా అయినా ఉంటుంది. లేదా వారి ప్లేస్ లోకి ఏ బిజెపినో లేక జనసేన నో వచ్చి కూర్చుంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: