మరికొన్ని రోజుల్లో తాను పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నానని మురిసింది ఆతల్లి వారింట్లోకి వచ్చే ఓ కొత్త మనిషి కోసం అందరు ఎదురు చూస్తున్న సమయాన లోపల వున్న పసిగుడ్దు ఇంకా ఎన్ని రోజులుండాలని అనుకున్నాడేమో బయటకు రావడానికి ప్రయత్నం చేసాడు,పాపం వాడికేమి తెలుసు మన్యం గ్రామాల ప్రజలకు వైద్యం అందని ద్రాక్షగా మిగిలిపోయిందని,తొందర పడకుండా కాస్త ఓపిక పట్టి అమ్మను ఓదార్చాలని,తాను కొత్తగా ఈ ప్రపంచానికి పరిచయం కావాలంటే తనకు జన్మను ఇచ్చే తల్లి ఎంతో వేదన పడాలని గ్రహించలేక పోయాడు ఫలితంగా తాను తనకు జన్మనిచ్చే తల్లికి ఇదే ఆఖరి శ్వాస అని రెండు ప్రాణాలు గాల్లో కలవడానికి సమయం ఆసన్నమైందని గ్రహించలేదు..హృదయాన్ని పిండేసేలా వున్న ఈ సంఘటన జరిగింది విశాఖ మన్యంలో..వివరాల్లోకి వెళ్లితే,




విశాఖ జిల్లా పెదబయలు మండలం జమదంగిలో ఐదు రోజుల క్రితం చోటు చేసుకోగా,ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దారుణ సంఘటనలోని విషయం ఏంటంటే వైద్యం కోసం నిండు గర్భిణి కొండ ప్రాంతాల్లో 20 కి.మీ.నడవటంతో తీవ్ర రక్తస్రావమైంది.దీంతో తల్లీబిడ్డ ఇద్దరూ ప్రాణాలు వదిలారు.జమదంగికి చెందిన లక్ష్మీ అనే నిండు గర్భిణి వైద్యం కోసం జి.మాడుగుల మండంలోని బొయితిలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు వెళ్లి,చికిత్స చేయించుకొని తిరుగు ప్రయాణమైందట,కొద్ది దూరం వచ్చాక పురిటి నొప్పులు రావడంతో డోలీలో ఆమెను ఇంటిని తీసుకెళ్లారు.అప్పటికే తీవ్ర రక్త స్రావం కావడంతో.. బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం ఆమె ప్రాణాలు విడిచింది.ఆమెతోపాటు పుట్టిన బిడ్డ కూడా చనిపోయింది.



ఈ ఘటనపై రెవెన్యూ సిబ్బంది ఉన్నతాధికారులకు నివేదిక అందించారట.వైద్య శాఖ మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకూ స్పందించలేదు.మాతా శిశు మరణాలను తగ్గించడం కోసం ప్రభుత్వాలు ఎన్ని పథకాలను తీసుకొస్తున్నా..మారుమూల గిరిజన ప్రాంతాల్లో అవేవీ అందుబాటులో ఉండటం లేదని చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణగా చెప్పొచ్చు. రహదారి సదుపాయం లేకపోవడం, దగ్గర్లో వైద్య సదుపాయం లేకపోవడంతో.. ప్రసవ మరణాలు ఏజెన్సీలో ఇప్పటికీ సాధారణం కావడం బాధాకరం.

మరింత సమాచారం తెలుసుకోండి: