పాపం అయన ఇంకా గత ప్రభుత్వంలో ఇచ్చిన మంత్రి పదవి ఉందనుకుంటున్నట్టు ఉన్నారు.  అని అనుకుంటున్నారు. అందుకే అప్పుడూ మంత్రి హోదాలో ఎలా దందాలు చేశారో అచ్చం అలానే ఇప్పుడు కూడా చేశారు. అప్పుడంటే అద్దిస్థానం అధికారంలో ఉంది, మంత్రి పదవి చేతులో ఉంది కాబట్టి ఏ పని చేసిన బయటకు వచ్చేది కాదు.                                            


కానీ ఇప్పుడు ఆలా కాదు కదా.. అధిష్టానం అధికారంలో లేదు, మంత్రి పదవి చేతిలో లేదు... మరి ఎంధుకు నీకు ఈ బెదిరింపు చర్యలు అచ్చెన్నాయుడు' అని అంటున్నారు నెటిజన్లు. ఇంకా విషయానికి వస్తే ... మహిళా ఎంపీడీఓపై చిందులు వేశారు అచ్చెన్నాయుడు. శనివారం కోటబొమ్మాళి మండల పరిషత్‌ కార్యాలయానికి వెళ్లి ఇన్‌చార్జి ఎంపీడీఓ ఎస్‌.రాజేశ్వరమ్మతోపాటు మిగిలిన అధికారులను బెదిరిస్తూ చిందులు వేశారు.                                         


మండల పరిషత్‌ కార్యాలయానికి వైఎస్సార్‌ సీపీ కార్యకర్తల తాకిడి ఎక్కువవుతోందని, దీనిని కట్టడి చేయాలంటూ ఆమెను హెచ్చరించారు.  తమకు అనుకూలంగా వ్యవహరించే విధంగా తీరు మార్చుకోవాలని, లేనిపక్షంలో సెలవు పెట్టి వెళ్లిపోవాలని ఇన్‌చార్జి ఎంపీడీఓను అచ్చెన్నాయుడు బెదిరించారు. దీంతో మండల పరిషత్‌ కార్యాలయ సిబ్బందితో పాటు మిగిలిన అధికారులు కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.                                               


ఈ నేపథ్యంలోనే అచ్చెన్నాయుడుపై నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడ్డు చేసిన దందాలు ఇప్పుడు చెల్లవు.. అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.            


మరింత సమాచారం తెలుసుకోండి: