మోడీ విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు.  ప్రస్తుతం ఆయన ఫ్రాన్స్ లో జరుగుతున్న జి7 దేశాల సదస్సులో మోడీ పాల్గొనేందుకు ఫ్రాన్స్ వేశారు.  అక్కడ  అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలు  ఈ సదస్సులో పాల్గొంటున్నాయి. ఫ్రాన్స్ ఆహ్వానం మేరకు మోడీ ఫ్రాన్స్ వెళ్లారు.  అక్కడ ప్రత్యేక అథితిగా ఈ సదస్సులో పాల్గొంటున్నారు.  ఇదిలా ఉంటె, నిన్నటి రోజున మోడీ ఫ్రాన్స్ నుంచి యూఏఈ వెళ్లారు.  అక్కడ ఆ దేశం అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. 


అనంతరం అక్కడి నుంచి బహ్రెయిన్ వెళ్లారు.  బహ్రెయిన్ దేశం మోడీకి మరిచిపోలేని గిఫ్ట్ ను అందించింది.  మోడీ ఆ దేశాధ్యక్షుడితో మంతనాలు జరిపారు.  బహ్రెయిన్ వెళ్లిన మొదటి ఇండియా ప్రధాని మోడీ కావడం విశేషం.  ఆ దేశంతో వాణిజ్య సంబంధాలతో పాటు దౌత్యపరమైన సంబంధాలు కూడా ఈ పర్యటన ద్వారా జరిగినట్టు తెలుస్తోంది.  


అయితే, మోడీ రాక సందర్భంగా బెహ్రెయిన్ ఓ మంచి గిఫ్ట్ ను ఇచ్చింది.  బహ్రెయిన్ జైలులో ఖైదీలుగా ఉన్న 250 మంది భారతీయ ఖైదీలను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది.  ఇది నిజంగా మోడీ దౌత్యానికి ఒక మైలురాయి అని చెప్పొచ్చు.  మోడీ రాకతో ఆ 250 మంది ఖైదీల్లో వెలుగులు వచ్చాయి.   అరబ్ దేశాలు ఇండియాకు దగ్గరవుతున్నాయి అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు.  


అరబ్ దేశాల్లో మోడీకి పెరుగుతున్న ఆదరణను అటు పాకిస్తాన్ గగ్గోలు పెడుతున్నది.  ఆర్టికల్ 370 రద్దు తరువాత అరబ్ దేశాలు దూరంగా ఉంటాయని, పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తాయని అనుకున్నారు.  కానీ, అందుకు విరుద్ధంగా జరగడం విశేషం.  అరబ్ దేశాలు మోడీకి సపోర్ట్ చేస్తున్నాయి.  ఇది మోడీ విజయంగా వర్ణించాలి. భారత్ ప్రపంచంలో బలీయమైన శక్తిగా ఎదుగుతుంది అనడానికి ఇదొక నిదర్శనం. 


మరింత సమాచారం తెలుసుకోండి: