సెప్టెంబర్ 1వ తేదీన గ్రామ సచివాలయ పరీక్షలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్స్ ఆన్ లైన్ లో పెట్టినారు. పరీక్షను కట్టుదిట్టంగా .. అత్యంత భద్రత మధ్య పరీక్షను అధికారులు నిర్వహించబోతున్నారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి లేదని అధికారులు చెబుతున్నారు. అత్యంత పారదర్శకంగా ఆన్ లైన్ లో నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు  చేశారు. జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఆంధ్రప్రదేశ్ యువత కోసం గ్రామ సచివాలయాలును ఏర్పాటు చేస్తూ, ఎప్పుడు ఏ రాష్ట్రం భర్తీ చేయనివిధంగా సుమారు లక్షగా పైగా జాబులకు నోటిఫికేషన్ ఇచ్చింది. నిజానికి ఇంతకు ముందు ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చిన ఇంత పెద్ద స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేయలేదని చెప్పాలి. టీడీపీ హయాం ఉన్నప్పుడు రిలీజ్ చేసిన ఉద్యోగాలను వేళ్ళ మీద లెక్కించుకోవచ్చు.


అది కూడా ఎన్నికలకు ముందు అరకొర ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకున్నది. ప్రభుత్వ ఉద్యోగాలు లేక గ్రామీణ యువత చాలా ఇబ్బందులు పడింది. ఇప్పుడు భారీ నోటిఫికేషన్ రావటంతో యువత ప్రేపరషన్ లో బిజీ అయిపొయింది. గ్రామ వాలంటీర్ల పోస్టులను వైసీపీ కార్యకర్తలకే ఇచ్చుకున్నారని టీడీపీ ప్రధానంగా ఆరోపించింది. అయితే అందులో వాస్తవాలు కూడా ఉన్నాయని చెప్పాల్సిందే. అయితే గ్రామ సచివాలయం విషయంలో మాత్రం అలా జరగకుండా ఆన్ లైన్ లో పరీక్ష ద్వారా ఎటువంటి విమర్శలకు తావు లేకుండా చేశారు. 


 ఇంకా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ త్వరలో ఇస్తామని జగన్ పేర్కొన్న సంగతీ తెలిసిందే . దీనితో యువత ఆనందంలో మునిగి పోయింది. గత ప్రభుత్వ హయాంలో నామమాత్రంగా ఉన్న ప్రభుత్వ ఖాళీలను కూడా భర్తీ చేయలేదు. దీనితో ప్రభుత్వ ఖాళీలు చాలా పెరిగిపోయాయి. జగన్ ప్రకటన ఇప్పుడు మరో సంచలనమంటే అతిశయెక్తి కాదు. దీనితో ఏపీలో ఉద్యోగాల జాతర మొదలైందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: