బీజేపీ మ‌రో సీనియ‌ర్ ఆస్ప‌త్రి పాల‌య్యారు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన మురళీ మనోహర్ జోషి ఆసుపత్రి పాలయ్యారు.  ఆదివారం అస్వ‌స్థ‌త‌కు గురైన  ఆయన్ను కాన్పూర్‌లోని రెజెన్సీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొన‌సాగుతోంది. 

 

 

బీజేపీ వ్యవస్థాపకుల్లో మనోహర్ జోషీ ఒకరైన జోషీ గతంలో పార్టీ జాతీయాధ్యక్షుడిగా పనిచేశారు. పార్టీ నిబంధనల ప్రకారం 75 ఏళ్లు దాటిన వారికి టికెట్లు నిరాకరించడంతో  ఇటీవ‌ల జ‌రిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. పోటీకి దూరంగా ఉన్న జోషీ ఈ సంద‌ర్భంగా కీల‌క లేఖ రాశారు. ‘ప్రియమైన కాన్పూర్ ఓటర్లకు.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాన్పూర్ నుంచి గానీ, మరెక్కడి నుంచీ గానీ పోటీ చేయొద్దని బీజేపీ సంస్థాగత వ్యవహారాల జనరల్ సెక్రటరీ రామ్‌లాల్ నాకు తెలిపారు’ అంటూ జోషి లేఖ రాశారు. పార్టీ వైఖరిని నేరుగా విమర్శించకపోయినా అసంతృప్తిని వ్య‌క్తం చేసేందుకు ఈ లేఖ రాశారు. అనంత‌రం, కాన్పూర్‌ టికెట్‌ ఇవ్వడం లేదన్న విషయం జోషీకి పార్టీ జనరల్‌ సెక్రటరీ రామ్‌లాల్‌ ద్వారా తెలియజేశారని, పోటీ చేయాలన్న ఆసక్తి లేదని బహిరంగ ప్రకటన చేయాలన్నది అమిత్‌ షా ఉద్దేశమని రామ్‌లాల్‌ స్వయంగా జోషీకి చెప్పగా.. ‘నువ్వు పోస్ట్‌మ్యాన్‌వి మాత్రమే. మోదీ, అమిత్‌ షా నా ముఖం చూడలేకపోతున్నారు ఎందుకు?’ అని ప్రశ్నించినట్లు సమాచారం. ఆ మరుసటి రోజే జోషీ.. కాన్పూర్‌ ఓటర్ల పేరుతో ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. 

 

 

కాగా, గత ఏడాది నుంచి బీజేపీ ప‌లువురు బీజేపీ సీనియ‌ర్లు క‌న్నుమూయ‌డం పార్టీ వ‌ర్గాల‌ను క‌ల‌వ‌రానికి గురి చేస్తోంది. వాజ్‌పేయి మ‌ర‌ణం అనంత‌రం  కొన్నిరోజుల వ్యవధిలోనే సుష్మ స్వరాజ్, అరుణ్ జైట్లీ కన్నుమూసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: