రెండు రోజుల క్రితం తిరుమలలోని శ్రీవారి ఆలయానికి సమీపంలోని సమీపంలోని బస్టాండ్ టికెట్ కౌంటర్లో ఇచ్చిన టికెట్ల వెనుక భాగంలో జెరూసలెం, హజ్ యాత్రకు సంబంధించిన ప్రకటనలు ఉన్నాయి. తిరుమల లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఆర్టీసీ టికెట్లపై అన్య మతాలకు చెందిన ప్రకటనలు ఉండటం పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. హిందూ అధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో ఇలాంటి వివాదాలు రావటం వలన అధికారులు నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. 
 
టీటీడీ అధికారులతో సమావేశం నిర్వహించిన ఎల్వీ సుబ్రహ్మణ్యం తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తూ హిందువులు కాని వారిని తిరుమల నుండి వెళ్ళిపోవాలని అన్నారు. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం వలనే బస్సు టికెట్ల వెనుక అన్య మత ప్రచారం జరుగుతుందని ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. భవిష్యత్తులో తిరుమలలో ఇలాంటి ఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. 
 
ఆర్టీసీ ఎండీని ఈ ఘటనకు సంబంధించిన వివరాలతో పూర్తి స్థాయి నివేదికను అందించాలని కోరారు. తిరుమల యొక్క పవిత్రతను కాపాడటం ప్రభుత్వం యొక్క బాధ్యత అని ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిగారు తిరుమలలో ఇలాంటి ఘటన జరగటంపై సీరియస్ అయినట్లు తెలుస్తుంది. ఇలాంటి సమస్యలపై వేగంగా నిర్ణయాలు తీసుకొని విమర్శలకు అవకాశం ఇవ్వకూడదని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తుంది. 
 
ఈ ఘటనలో విచారణ కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఈ రోజు తిరుమలకు పంపారు. ఈరోజు టీటీడీ అధికారులతో ఎల్వీ సుబ్రహ్మణ్యం సమావేశం నిర్వహించి ఈ వ్యాఖ్యలు చేసారు. తిరుమలలో అన్య మత ప్రచారాన్ని నిరోధించటానికి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారులతో తెలిపారు. ఈ ప్రయత్నాల వలన తిరుమలలో అన్య మత ప్రచారం ఆగిపోతుందని భావించొచ్చు. 


 
 



మరింత సమాచారం తెలుసుకోండి: