మోడీ ఎక్కడికి వెళ్లినా దాదాపుగా హిందీలోనే మాట్లాడుతాడు.  మనకు బాగా వచ్చిన, తెలిసిన భాషలో మాట్లాడటం వలన మన భావాలను అర్ధవంతంగా, భావవంతంగా ప్రకటించగలుగుతారు.  ఇతర భాషలను అనర్గళంగా మాట్లాడే వ్యక్తులు కూడా కొన్ని విషయాలను వేరే భాషల్లో అర్ధవంతంగా ప్రకటించలేకపోతున్నారు. అర్ధవంతంగా ప్రకటించాలి అంటే.. భాష అవసరం.  


అయితే, ఇటీవలే మోడీ డిస్కవరీ ప్రోగ్రాం కోసం బేర్ గ్రిల్స్ తో కలిసి మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రాం లో పాల్గొన్నారు.  ఫిబ్రవరి 14 వ తేదీన షూటింగ్ జరుపుకున్న ఈ ప్రోగ్రామ్ ఆగష్టు 12 వ తేదీన ప్రసారం జరుపుకుంది.  ఈ ప్రోగ్రామ్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది.  గతంలో బేర్ గ్రిల్స్ చేసిన ప్రోగ్రాం కంటే ఈ ప్రోగ్రామ్ రెండు మూడు రేట్లు అధికంగా వ్యూస్ వచ్చాయి.  అంతా బాగుంది.  అయితే, ఇందులో ప్రధాని మోడీ హిందీలో మాట్లాడుతుంటే.. ఎలా అర్ధం అయ్యింది అని అంతా షాక్ అయ్యారు.  


దీనికి మోడీ వివరణ ఇచ్చారు.  మోడీ ఇచ్చిన వివరణ ప్రకారం.. తాను హిందీలో మాట్లాడిన ప్రతి మాటను వెంటనే చిన్న ట్రాన్స్మిటర్ ద్వారా  ఇంగ్లీష్ లోకి తర్జుమా అవుతుంది.  బేర్ గ్రిల్ తన చేతిలో దాన్ని పెట్టుకున్నాడు.  తద్వారా నేను అట్లాడిన హిందీ మాటలు ఇంగ్లీష్ లో ఆయనకు వినిపించేవి అని చెప్పాడు.  అలా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ నడిచిందని అన్నారు.  


టెక్నాలజీని వినియోగించుకోవడం వలన ఇది సాధ్యం అయ్యింది మోడీ మన్ కి బాత్ ప్రోగ్రామ్ లో పేర్కొన్నారు. ఇండియా పర్యావరణాన్ని, ఇండియాను ప్రపంచానికి తెలియజేయడానికి డిస్కవరీ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడిందని చెప్పారు.  డిస్కవరీ ప్రోగ్రాం ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించగలిగామని, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇండియా వైపు చూస్తున్నారని అన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: