బీజేపీ పార్టీకి బాగా తొందరెక్కువ ఉన్నట్టుండి. అందుకే తన అధికార బలంతో .. డబ్బు బలంతో నాయకులను బీజేపీలోకి లాగేస్తుంది. కానీ దీని వల్లన ఉపయోగం ఉంటుందా అన్నదే అసలైన ప్రశ్న. చంద్రబాబు కూడా వైసీపీ నుంచి అప్పట్లో 23 మంది ఎమ్మెల్యేలను కొన్నుకున్నాడు. కానీ చివరికి ఏమైంది .. పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. కానీ బీజేపీ మాత్రం ఇవన్నీ ఆలోచించకుండా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రెచ్చిపోతుంది. ప్రజల్లో అసలైన బలాన్ని పెంచుకోకుండా ఇలా అడ్డ దారులు తొక్కితే ఉపయోగం ఉంటుందా .. ? జాతీయ పార్టీ అయినా బీజేపీ ఏపీలో బలపడటానికి ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు.


2019 ఎన్నికల్లో బీజేపీ ఏపీలో ఒక్క సీటు గెలువకపోయిన కేంద్రంలో మాత్రం అదిరిపోయే విజయాన్ని నమోదు చేసింది.  కేంద్రం స్థాయిలో మోడీ హవాతో దేశం మొత్తం స్వీప్ చేసింది. దీనితో కేంద్రంలో బీజేపీకి తిరుగు లేకుండా పోయింది. అయితే అన్ని రాష్ట్రాల్లో చివరికి సౌత్ లోని కర్ణాటకలో కూడా బీజేపీ హవా స్పష్టంగా కనిపించినా ఏపీ లో మాత్రం లేదు. జగన్ .. 30 ఏళ్ల టీడీపీని మట్టికరిపించి 25 పార్లమెంట్ స్థానాల్లో ఏకంగా 22 స్థానాలు గెలుచుకొని సరికొత్త సునామీని సృష్టించారు. అయితే తెలంగాణలో మాత్రం బీజేపీ అనూహ్యంగా 4 ఎంపీ స్థానాలను గెలుచుకొని ఔరా అనిపించింది. బీజేపీ ఇప్పుడు తెలంగాణతో ఏపీలో కూడా పాగా వేయాలని వ్యహ రచన చేస్తుంది. 


అయితే బీజేపీ ఆపరేషన్ లో భాగంగా టీడీపీ ఆర్ధిక స్థంబాలు అయినా నలుగురు రాజ్య సభ సభ్యులు ఇప్పుడు బీజేపీలోకి వెళ్లిపోయారు. ఈ నలుగురు బాబు గారికి అత్యంత సన్నిహితంగా ఉండే నేతలు. అలాగే రాష్టంలో టీడీపీ నుంచి చోటా మోటా నాయకులను బీజేపీ లాగేసింది. దీనితో బీజేపీ .. టీడీపీ నుంచి వచ్చిన నేతల ద్వారా బలపడాలని భావిస్తుంది. నిజంగా ఇలా బలపడటం ఇది సాధ్యమా ఆంటే దానికి సమాధానం చెప్పలేము. కానీ బీజేపీ తన ఓటు షేర్ పెరుగుతుందని ఆశిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: