బండి తీసుకొని రోడ్డెక్కితే ఇక మీద‌ట చాలా జాగ్ర‌త్త‌లు వ‌హించాల్సి ఉంటుంది. ఓవర్‌స్పీడ్‌, హెల్మెట్ ధ‌రించ‌క‌పోవ‌డం, ట్రాఫిక్ రూల్స్‌ని పెద్దగా పట్టించుకోక‌పోవ‌డం జరిమానాలు కట్టేద్దాంలే అని నిర్లక్ష్యంగా ఉండ‌డం లాంటివి ఇక చెల్ల‌వు. మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి ఆమోదం తెలిపితే చట్టంగా మారుతుంది. ఆ తర్వాత నిబంధనలు మారబోతున్నాయి. జరిమానాలూ పెరగబోతున్నాయి. వాహనదారులారా.. బహుపరాక్.. ఇప్పటి వరకు హెల్మెట్ లేకుండా ప్రయాణించినా.. రాంగ్ రూట్‌లో వెళ్లినా.. సిగ్నల్ జంప్ చేసినా.. ట్రిపుల్ రైడింగ్ అయినా.. డ్రంక్ అండ్ డ్రైవ్ అయినా.. చాలా తక్కువ పెనాల్టీలు ఉన్నాయని చెప్పి.. చూసీ చూడనట్లు వెళ్లారు. కానీ ఇకపై అలా కుదరదు. ఎందుకంటే ముందు చెప్పిన ట్రాఫిక్ ఉల్లంఘనలే కాదు, ఇకపై ఏ ట్రాఫిక్ రూల్‌ను అతిక్రమించినా.. భారీగా జరిమానా చెల్లించాల్సిందే..!ఈ బిల్లులోని కీలక అంశాలు ఇవే. 
 
అధికారుల ఆదేశాలను పట్టించుకోకపోతే ప్రస్తుత జరిమానా రూ.500 కాగా కొత్త ఫైన్ రూ.2000. లైసెన్స్ లేకుండా వాహనాన్ని ఉపయోగిస్తే ప్రస్తుత జరిమానా రూ.1000 కాగా కొత్త ఫైన్ రూ.5000. లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపికే ప్రస్తుత జరిమానా రూ.500 కాగా కొత్త ఫైన్ రూ.5000.  అర్హత లేకుండా డ్రైవింగ్ చేస్తే ప్రస్తుత జరిమానా రూ.500 కాగా కొత్త ఫైన్ రూ.10,000. వాహనాలపై ఎక్కువ లోడ్ వేస్తే రూ.5000 జరిమానా చెల్లించాల్సిందే. ఓవర్ స్పీడ్‌కు ప్రస్తుత జరిమానా రూ.400. కొత్త జరిమానా చిన్న వాహనాలకు రూ.1000, మీడియం ప్యాసింజర్ వాహనాలకు రూ.2000.  ప్రమాదకరంగా డ్రైవ్ చేస్తే ప్రస్తుత జరిమానా రూ.1,000 కాగా కొత్త జరిమానా రూ.5000 వరకు ఉంటుంది. డ్రంకెన్ డ్రైవింగ్‌కు ప్రస్తుత జరిమానా రూ.2000 కాగా కొత్త ఫైన్ రూ.10,000. రేసింగ్‌కు ప్రస్తుత జరిమానా రూ.500 కాగా కొత్త ఫైన్ రూ.5,000. మైనర్లకు బండి ఇస్తే వాహన యజమానిపై కేసు నమోదు కానుంది. దాంతో పాటు వాహన రిజిస్ట్రేషన్ రద్దవుతుంది. 


అయితే దీని పై కొంద‌రు సామాన్య ప్ర‌జ‌లు ఈ విధంగా స్పందిస్తున్నారు. అంత ఫైన్ లు ఎందుకు కట్టాల‌ని. వాళ్ల‌ ఇష్టం వచ్చినట్టు మీ జీతాలు పెంచుకున్నట్టు పెనాల్టీలు వేస్తారా అని. రూల్స్ ప్రకారం రోడ్లు ఉన్నాయా, రోడ్ల ప్రకారం వాహనాలకు పర్మిషన్ ఇచ్చారా, వాహనాలకు సరిపడా రోడ్లేసారా,రోడ్ల విస్తరణలు చేసారా..? పట్టణాలలో పార్కింగ్ స్దలాలు చూపి౦చారా ..? పార్కింగ్ ప్లేస్ లేని వాణిజ్య సముదాయాలకు మీరే పర్మీషన్ ఇచ్చి రోడ్లమీద పార్క్ చేస్తే "పెనాల్టీ" మీరే వేస్తారా..? ఇదెక్కడి న్యాయం..? దానికి సాకు ప్రజల భద్రతా..! పెనాల్టీలు వసూలు చేసే అర్హత ప్రభుత్వానికి లేదు. ప్రజలకు నోట్లో నాలుక లేదని మీ ఇష్టం వచ్చిన రూల్స్ తెస్తారా రూల్సు తెచ్చే ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేసారా!!?? టార్గెట్ లు పెట్టి మరీ మద్యం షాపులు తెరిచి..డ్రంక్ అండ్ కేసులు పెడతారా..?రోడ్లకు అడ్డంగా బోర్డులను ఎందుకు పెట్టి ప్ర‌జ‌లను ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలను పీల్చి పిప్పి చేస్తారా..! 


అడిగే వారు ఎవరూ లేరనా? ఇలా ఎన్నో ప్ర‌శ్న‌లు ప్ర‌జ‌ల్లోంచి వెలువ‌డుతున్నాయి. 
ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం వేధిస్తూ "విధిస్తున్న" జరిమానాలు సామాన్యుడి  నడ్డి విరిచేలా ఉన్నాయి... దానికి తగ్గట్లుగా మద్యం నియంత్రణ, రోడ్ల సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించాలనేదే ప్రభుత్వానికి,ఫైన్ విధించే వారికి, ప్రశ్న..? ప్రభుత్వం కూడా ఈ కింది వాటికి ఫైన్ కట్టాలిరోడ్డు పై గల ఒక్కో గుంతకు 1000, కంకర తేలితే 2000, దుమ్ము లెగిస్తే 3000, బురద రోడ్డుకు 5000 బాగుగా లేని రోడ్డు వల్ల ప్రాణం పోతే ప్రతి మనిషికి 10,00,000 ప్రాణ నష్టం ఇవ్వగలరాచేసే పనులు పద్ధతిగా ఉంటే పద్ధతి ప్రకారం పాటించవచ్చు అని కొంద‌రు సామాన్య ప్ర‌జ‌లు త‌మ ఆవేశాన్ని వ్య‌క్త‌ప‌రుస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: