ఏపీ సీఎం రెండు నెల‌లుగా ఎక్క‌డా చిన్న రిమార్క్ లేకుండా పాల‌న కొన‌సాగిస్తూ వ‌చ్చారు. ఆయ‌న ఎప్పుడైతే అమెరికా వెళ్లారో ఆ వారం రోజుల్లో వైసీపీకి, జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అయిపోయింది. ఏపీ కేబినెట్‌లో జ‌గ‌న్ ఎంతో న‌మ్మ‌కంతో తీసుకున్న మంత్రులు అంద‌రూ చేసిన రాంగ్ స్టెప్పులు, అవ‌గాహ‌నా రాహిత్యంతో చేసిన వ్యాఖ్య‌లు జ‌గ‌న్ మెడ‌కు చుట్టేసుక‌న్నాయి. ఓ ముఖ్య‌మంత్రి వారం రోజుల పాటు లేక‌పోతే క‌నీసం ప్ర‌తిప‌క్షానికి కౌంట‌ర్లు ఇవ్వ‌డం చేత‌కాని మంత్రులు ?  ఎందుకు ? అన్న విమ‌ర్శ‌లు వైసీపీ కేడ‌ర్ నుంచే వ‌స్తున్నాయి. 


జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న‌ప్పుడు ఏపీలో వ‌ర‌ద రాజ‌కీయాలు కాక‌రేపాయి. ఈ అంశంపై అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీలు ప‌ర‌స్ప‌రం ఆరోప‌ణ‌లు చేసుకున్నాయి. రాష్ట్రంలో వ‌ర‌ద‌ల‌ను తెలుగుదేశం పార్టీ త‌న‌కు పెద్ద అస్త్రంగా మ‌లుచుకుంది. మ‌రోవైపు సీనియ‌ర్ నేత‌గా ఉన్న బొత్స రాజ‌ధాని విష‌యంలో అవ‌గాహ‌న రాహిత్యంతో చేసిన వ్యాఖ్య‌లు విప‌క్షాల‌కు అస్త్రంగా మారితే... ప్ర‌జ‌ల్లో లేనిపోని గంద‌ర‌గోళానికి కార‌ణ‌మ‌య్యాయి. 


ఇక మ‌రో మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ ప్ర‌కాశం బ్యారేజ్ గేట్ల‌లో ఇరుక్కున్న బోటును తీయించేందుకు ద‌గ్గ‌రుండి చేసిన ప్ర‌య‌త్నాల్లో ఒక వృద్ధుడు కొట్టుకుపోవ‌డం కూడా విప‌క్షాల‌కు పెద్ద అస్త్రంగా మారింది. ఇక రాజ‌ధాని విష‌యంలో పార్టీ స్టాంగ్ ఏంటో తెలుసుకోకుండా బొత్స ఒక‌లా.. మ‌రికొంద‌రు మంత్రులు మ‌రోలా మాట్లాడ‌డం సామాన్య ప్ర‌జ‌ల్లోనూ పార్టీ విధానం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. టీడీపీ ఇదే టైంలో సోష‌ల్ మీడియాలో కొన్ని అస‌త్య ఆరోప‌ణ‌లు కూడా చేస్తోంది. ఈ అస‌త్య ఆరోప‌ణ‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొట్ట‌డంలో అధికార వైసీపీ పార్టీ పూర్తిగా వి ఫ‌ల‌మైంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. 


ఇక వ‌ర‌ద‌ల విష‌యానికి వ‌స్తే వీటిని టీడీపీ చాలా బాగా ప్రొజెక్ట్ చేయ‌గా, వైసీపీ స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొట్ట‌లేక‌పోయింది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రాష్ట్రంలో లేక‌పోవ‌డంతోపాటు, మంత్రులు కూడా అనుకున్న స్థాయిలో స్పందించ‌క‌పోవ‌డంతో టీడీపీకి అడ్డుక‌ట్ట వేసేవారు క‌రువ‌య్యారు.  ఏదేమైనా మంత్రుల‌ను న‌మ్ముకుంటే ప‌నులు అవ్వ‌వ‌ని ఈ సారి జ‌గ‌న్‌కు క్లారిటీ వ‌చ్చింది. ఈ విష‌యంలో జ‌గ‌న్ ఇక‌పై అయినా జాగ్ర‌త్త‌గా ఉంటాడేమో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: