బాంబులు పేలడం, పేల్చడం కల్చర్లోకి మెల్లగా సమాజం వచ్చేసింది. గన్ కల్చర్ విదేశాల్లో ఉందనుకుంటే బాంబుల కల్చర్ మన సీమల్లో ఉంటుంది. ఎక్కడ ఏ ఆయుధం అయినా కూడా హింసను తట్టి లేపడమే కదా. అహింసామూర్తి మహాత్ముడు పుట్టిన నేలలో ఇంకా ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయంటే షాకే మరి. ఇవన్నీ ఇలా ఉంటే ప్రక్రుతి ప్రకోపించి మానవాళిని మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తోంది.


ఇటీవల ఉత్తర భారతాన కురిసిన భారీ వానలకు ఉల్లి పంట మొత్తం పోయి   ఉల్లి పాయల ధరలు ఆకాశాన్ని అంటాయి. క్రితం నెల వరకూ మార్కెట్లో 15 రూపాయలకు కిలో ఉల్లి పాయలు దొరికేవి. ఒక్కసారిగా అవి మూడు రెట్లు ఇపుడు పెరిగిపోయాయంటే  షాకే మరి. ఇపుడున్న ధరల ప్రకారం చూస్తే ఉల్లి కిలో నలభై అయిదు నుంచి యాభై రూపాయల వరకూ ఉంది. ఇది నిజంగా దారుణమని వంట గదిలో మహిళలు గోడుమంటున్నారు.


ఇక ఎందుకిలా సడెన్ గా ఉల్లి ధర పెరిగింది అంటే తెలుగు రాష్ట్రాలకు ఉల్లిపాయలు సరఫరా అయ్యే మహారాష్ట్ర, కర్నాటకలలో భారీ వరదలు వచ్చి ఉల్లి పంట మొత్తం కొట్టుకుపోయింది. దాంతో ఉల్లి దిగుబడి తగ్గిపోయింది.  ఎగుమతులు ఆగిపోయాయి. ఈ పరిణామంలో తెలుగు రాష్ట్రాలో ఉల్లి బాంబులా  పేలుతోంది. వంటింట్లో ఈ బాబు పేలుతూంటే ఆడవాళ్ళు ఉల్లి పాయ తరగకుండానే కన్నీళ్ళు పెడుతున్నారు.


సరిగ్గా ఇరవయ్యేళ్ళ క్రితం ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో ఉల్లిపాయల ధరలు దారుణంగా పెరగడంతో నాటి బీజేపీ ప్రభుత్వం ఘోరంగా ఓడిపోయింది. ఆ దెబ్బ అలా ఇలా తగల్లేదు.అందుకే ఉల్లి అంటే రాజకీయ నాయకులు ముందే కన్నీరు పెట్టేస్తారు. బీజేపీ వాళ్ళకు అయితే వణుకే పుడుతుంది. ఇదిలా ఉండగా ఈ ఉల్లి ధర ఇప్పట్లో తగ్గదని అంటున్నారు. రానున్నవి పండుగ రోజులు దాంతో కార్తీక మాసం వరకూ ఉల్లి రేటు అలా పెరిగి పోయి అరవై డెబ్బైకి కిలో రేటు ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. అంటే ఇంక ఉల్లి పాయ నంజుకుంటూ గంజి నీళ్ళు పేదోడు తాగలేనట్లే.


మరింత సమాచారం తెలుసుకోండి: