కాశ్మీర్ విభజన తరువాత భారత్ పాక్ ల మధ్య పచ్చగడ్డి అక్కరలేకుండానే మంటలు మండిపోతున్నాయి. పాక్ భారత్ పై గుర్రుమీదుంది. గుస్సా అవుతోంది. తన అసహనాన్ని భారత్ మీద బాగా చూపిస్తోంది. ఇతర దేశాల మద్దతు ఎటూ అందకపోవడంతో ఇంకా కసి మీద ఉంది. ఆ అక్కసు, ఉక్రోషం మాటలో చూపిస్తూ భారత్ ని కవ్విస్తోంది. ఓ విధంగా సరిహద్దులు ఉద్రిక్తంగా  ఉండాలి.


ఈ నేపధ్యంలో మోడీ విదేశీ టూర్ కి వెళ్ళారు. ఫ్రాన్స్ లో జరుగుతున్న జీ 7 సమావేశాల్లో భారత్ పాల్గొంటోంది. 2005 తరువాత భారత్ కి ఈ ఆహ్వానం లభించింది. ఈ సమవేశాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో భారత ప్రధాని మోడీ ఈ రోజు భేటీ కానున్నారు. భారత కాల మానం ప్రకారం ఈ రోజు మధ్యాహ్యం 3.45 నిముషాలకు ప్రధాని మోడీ ట్రంప్ ముఖాముఖీ భేటీ జరగనుంది.


ఈ భేటీ నలభై నిముషాల పాటు జరగనుంది. ఈ భేటీలో భాగంగా పాక్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న విషయాన్ని ట్రంప్ కి వివరిండంతో పాటు, కాశ్మీర్లో ఉన్న పరిస్థితులు,  370 ఆర్టికల్ రద్దు, భారత్, అమెరికా వాణిజ్య సంబంధాలు వంటివి చర్చకు రానున్నాయి. కాశ్మీర్ ని విభజించాక మోడీ ట్రంపు కలవడం ఇదే తొలిసారి.


దాంతో ఈ ఇద్దరి భేటీపై సర్వత్రా ఆసక్తి కలుగుతోంది. ఇక ట్రంప్ భారత్, పాక్ ల మధ్య తాను జోక్యం చేసుకుంటానని పదే పదే చెప్పడం, మధ్యవర్తిత్వానికి ఉత్సాహం చూపడంతో మోదీ ఆయనకు ఏం చెప్పబోతున్నారన్నది కూడా ఇంటెరెస్టింగ్ మ్యాటర్. ఇప్పటికే టెలిఫోన్ ద్వారా అమెరికాకు మోడీ  కాశ్మీర్ గురించి పూర్తిగా వివరించి చెప్పారు. ఇపుడు ముఖాముఖీ భేటీ ద్వారా అమెరికాకు మరింత సన్నిహితం అవుతారన్న బెంగ పాక్ ఉంది. ఏది ఏమైనా అన్ని దేశాలను పాక్ కి దూరం చేస్తున్న మోదీ విదేశీ దౌత్యంతో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: