సోషల్‌ మీడియా.. ఇది ఇప్పుడు బలమైన మీడియాగా అవతరిస్తోంది. ఏ ఒక్కరి చేతుల్లోనో బందీ కానీ ఈ మీడియా.. ప్రధాన మీడియాకు ఉన్న బలహీనతల ఆధారంగా మరింతగా విజృంభిస్తోంది. అందుకే అన్ని పార్టీలు సోషల్ మీడియా సెల్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే.. సోషల్ మీడియాలో మంచి ,చెడు చర్చ జరిగడం మంచిదే.. తప్పు కాదు..


కానీ అన్యాయంగా ఎదుటి పార్టీపై బురద జల్లే ధోరణి మంచిది కాదు. ఇటీవల టీడీపీ అలా చేస్తూ అదే సోషల్ మీడియాకు దొరికిపోయింది. ఇలాంటి చర్యలవల్ల భవిష్యత్తులో వారికే నష్టం చేస్తుంది. తమ ప్రచారం లో ఒక నిజాయితీ ఉంటే ప్రజలు ఎప్పటికైనా నమ్ముతారు. అలా కాకుండా తప్పుడు ఆరోపణలతో సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే వారే ఇబ్బంది పడతారు. తాజాగా ఏపీ సర్కారుపై బురద జల్లేందుకు ప్రయత్నించిన ఓ పెయిడ్ ఆర్టిస్టు కారణంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరువు గంగలో కలుస్తోంది.


మొన్నటి కృష్ణా వరదల సమయంలో టీడీపీ సోషల్ మీడియా విభాగం ఓ పోస్టు చేసింది. అందులో వరదల కారణంగా నష్టపోయిన ఓ రైతు ఆవేదన వినిపించారు. వాస్తవానికి ఆయన రైతు కాదు.. టీడీపీ పెయిడ్ ఆర్టిస్టు.. పేరు శేఖర్ చౌదరి. శేఖర్ చౌదరిది గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని అప్రతిష్ట చేసే పెయిడ్‌ పబ్లిసిటీలో ఇతడు కీలకంగా వ్యవహరించాడు. ఎన్నికల సమయంలో టీడీపీ ప్రకటనల్లో కూడా నటించాడు.


మొన్నటి వరద సమయంలో రైతు వేషం కట్టి తానే ఒక రైతును అని ప్రజలను నమ్మించడం ద్వారా రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందన్న భావన కలిగించేందుకు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నటించాడు . అంతే కాదు..మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను కులం పేరుతో దూషించాడని అభియోగాలు ఉన్నాయి. మొత్తానికి పోలీసులు ఈ పెయిడ్ ఆర్టిస్ట్ ను అరెస్టు చేశారు. శేఖర్ తన తప్పులను ఒప్పుకున్నాడని అంటున్నారు. తనతో పాటు ప్రభుత్వంపై బురద జల్లేందుకు పలువురిని టీడీపీ ఉపయోగిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడించారట.


మరింత సమాచారం తెలుసుకోండి: