కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొన్ని వినూత్నమైన నిర్ణయాలు తీసుకుంటూ చకచకా అమలు చేస్తూ దూసుకుపోతున్నది. ప్లాస్టిక్ రహిత ఇండియాను గాంధీ జయంతి నుంచి అమలు చేయబోతున్నది.  ప్లాస్టిక్ వస్తువులను వాడటం.. వంటి వాటిని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.  అన్నింటికంటే ముఖ్యంగా గతంలో టీ కోసం ప్లాస్టిక్ కాపులను వాడేవారు.  వాటి స్థానంలో ఇప్పుడు చాలా ప్రాంతాల్లో పవర్ కప్పులు అందుబాటులోకి వచ్చాయి.  


పేపర్ కప్పులు కూడా కొంతవరకు పర్యావరణానికి సేఫ్ కాదు.  అందుకే వీటి స్థానంలో మట్టికప్పులను ప్రవేశపెట్టాలని కేంద్రం చూస్తోంది. మట్టికప్పుల్లో టీ తాగడం చాలా బాగుంటుంది.  గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో మట్టికప్పుల వినియోగాన్ని అమలులోకి తీసుకొచ్చినా దాన్ని సక్రమంగా అమలు చేయలేకపోయారు.  దీంతో కొన్ని రోజులకే ఆ పధకం మూతపడింది.  


అయితే, ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఈ పధకాన్ని సక్రమంగా అమలు చేసేందుకు సిద్ధం అయ్యింది.  రైల్వే స్టేషన్స్ లో మట్టి కప్పుల వినియోగాన్ని తీసుకొస్తే చాలా వరకు ప్రకృతికి మేలు చేసినట్టే అవుతుంది.  అంతేకాదు, ప్లాస్టిక్ ప్లేట్స్ స్థానంలో మట్టి ప్లేట్స్ ను వినియోగంలోకి తీసుకు రావాలని చూస్తున్నది. 

మట్టి ప్లేట్లు అమలులోకి తీసుకొస్తే.. దానివలన ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.  మట్టి భూమిలో కలిసిపోతుంది.  రే సైక్లింగ్ కు ఉపయోగపడుతుంది.  ఇప్పటికే వారణాసి, బరేలి రైల్వే స్టేషన్స్ లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది.  మిగతా అన్ని స్టేషన్స్ లో కూడా వీటిని ప్రవేశ పెట్టాలని రైల్వేశాఖ చూస్తున్నది.  పీయూష్ గోయల్ ఈ దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. 


కేంద్ర రవాణా శాఖ మంత్రి ఇప్పటికే రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తో ఈ విషయంపై చర్చించినట్టు తెలుస్తోంది. పధకం అమలు చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా రూపకల్పన చేసిన తెలుస్తోంది.  ఒకవేళ ఈ పధకం అమలు జరిగితే.. పర్యావరణ భారతానికి ఓ అడుగు ముందుకు పడినట్టే అందులో సందేహం అవసరం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: