జగన్మోహన్ రెడ్డిపైన చంద్రబాబునాయుడు, నారా లోకేష్ కున్న గుడ్డి వ్యతిరేకతకు ఓ పెయిడ్ ఆర్టిస్ట్ బలైపోయాడు. ఎన్నికలకు ముందు చంద్రబాబు బ్రహ్మాండమంటూ పొగిడేందుకు టిడిపి రకరకాల విన్యాసాలు చేసింది. అందులో ప్రకటనలు కూడా ఒకటి. ఇందులోనే పెయిడ్ ఆర్టిస్టులతో రకరకాల వేషాలు వేయించి సామాన్య జనాలు చంద్రబాబు పాలనను పొగుడుతున్నట్లుగా నాటకాలు ఆడించారు. సరే అవన్నీ బెడిసికొట్టాయనుకోండి అది వేరే సంగతి.

 

ఎన్నికల్లో జనాలు టిడిపి మాడు పగలగొట్టారు. ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న తర్వాత కూడా టిడిపికి బుద్ధి రాలేదు. తమను జగన్మోహన్ రెడ్డి చావు దెబ్బకొట్టటాన్ని చంద్రబాబు, లోకేష్ తట్టుకోలేకపోతున్నారు. అందుకనే తమ ఉక్రోషాన్నంతా మొన్నటి వరదల సందర్భంగా చూపించారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అబ్బా, కొడుకులు వేసిన చాలా వేషాలు వికటించి ఎదురు తిరిగినా బుద్ధి రాలేదు.

 

మొన్నటి వరదలపై ఓ రైతు ఇటు జగన్ ను అటు ఇరిగేషన్ శాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ను నోటికొచ్చినట్లు తిట్టాడు. జనాలకు అంత కోపం ఉన్నా ఎవరూ అలా నోటికొచ్చినట్లు మాట్లాడరు.  అలాంటిది జగన్, అనీల్ ను తిట్టిన రైతు ఎవరా అని ఆరాతీస్తే అసలు విషయం బయటపడింది. తిట్టిన వ్యక్తి అసలు రైతే కాదని టిడిపి పెయిడ్ ఆర్టిస్ట్ అన్న విషయం అందరికీ తెలిసింది.

 

గుంటూరు జిల్లాలోని వేమూరు నియోజకవర్గానికి చెందిన శేఖర చౌదరిగా గుర్తించారు. ఇంకేముంది వెంటనే వైసిపి నేతలు డిజిపి గౌతమ్ సవాంగ్ కు ఫిర్యాదు చేశారు.వేర్వేరు ప్రకటనల్లో నటించిన నలుగురు ఆర్టిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు కూడా వెంటనే చౌదరిని అరెస్టు చేసేశారు. ఇదే చౌదరి ఎన్నికల సమయంలో కూడా టిడిపి ప్రచారంలో నటించిన విషయం బయటపడింది. దాంతో పోలీసులు చౌదరిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. జగన్, అనీల్ ను చౌదరి తిట్టిన వీడియోను లోకేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా బాగా ప్రమోట్ చేశారు. కాబట్టి లోకేష్ మీద కూడా పోలీసులు చర్యలు తీసుకుంటారేమో చూడాలి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: