రెండు రోజుల నుంచి అమరావతిని తరలిస్తే ఉరుకోము .. తరలిస్తే రైతులకు నష్టం కలుగుతుంది. అంటూ ఎదో పెద్ద ప్రజా క్షేమం పట్ల బాధ్యత ఉన్నోళ్ల  మాదిరిగా మాట్లాడుతున్న సో కాల్డ్ నాయకులూ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది. రాజధాని ప్రాంతం వరదలకు లోనయ్యే ప్రాంతమని ఏకంగా శివరామన్ కమిటీ కూడా చెప్పింది. కానీ అప్పటి ప్రభుత్వం ఖాతరు చేయలేదు. మరి లక్ష కోట్లు అయ్యే చోట .. మూడు లక్షల కోట్లు అవుతుంది. మరి దీనికి సమాధానం మీడియాలో రచ్చ చేసే సో కాల్డ్ మేధావులు చెప్పగలరా ? రాజధాని గురించి వాస్తవ దృక్పధంతో ఎవరు కూడా మాట్లాడటం లేదు. నిజానికి ఇప్పుడు రాజధానిని మారిస్తే ఇప్పుడు అక్కడ కోల్పోవటానికి కూడా ఏమి లేదు. ఎప్పుడు సునామీలా భారిన పడే ఇండోనేషియా కూడా తమ రాజధానిని వేరే చోటకు మార్చాలనుకుంటుంది.


అలాటింది భారత్ లో అంతర్భాగం అయినా ఏపీ రాజధానిని మారిస్తే వచ్చిన నష్టమేమి లేదని చెప్పాలి. నిజంగా అమరావతి మారుతుందేమోనని మీడియానే జనాల్లో ఒక రకమైన గందరగోళాన్ని రేపారు. ఇక మీడియా చేసే హడావిడికి టీడీపీ కూడా జత అయ్యి ప్రభుత్వం ఏమి చెప్పకముందే అన్నీ వీళ్ళే క్రియేట్ చేశారు. వైసీపీ నేత మంత్రి బొత్స సత్య నారాయణ చేసిన వ్యాఖ్యలను పట్టుకొని టీడీపీ నానా హంగామా చేస్తుంది. నిజానికి బొత్స సత్య నారాయణ రాజధానిని మారుస్తన్నామని ఎక్కడ చెప్పలేదు. బొత్స చెప్పింది కేవలం .. అమరావతికి వరద పోటు ఎక్కువగా ఉందని నిర్మాణాలకు లక్ష రూపాయలు పెట్టే చోట రెండు లక్షలు పెట్టాలిసిన పరిస్థితి వస్తుందని చెప్పారు.


అంతక మించి ఇంకేమి చెప్పలేదు. కానీ టీడీపీ మాత్రం తామేదో ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించామని దానిని మార్చవద్దని తెగ బాధపడిపోతోంది. అమరావతి మార్పు అనేది ఎక్కడ కూడా వైసీపీ ప్రభుత్వం ప్రకటించలేదు. కానీ టీడీపీ తో పటు మీడియా కూడా అతిగా ప్రసారం చేస్తూ నానా హంగామా చేసింది.  ఎన్నికల ముందు కూడా వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని మారిపోతుందని .. దొనకొండకు తరలిస్తారని చంద్రబాబు ఎన్నికల్లప్పుడు ఆరోపించారు. దాని ద్వారా ప్రజల్లో ఓట్లను పొందాలని చూశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: