రాజధాని నిర్మాణంలో రెండు పార్టీలు కలిసి రచ్చ చేస్తున్నాయి. రెండు నెలల క్రితం అధాకారంలోకి వచ్చిన దగ్గర నుండి పాలనలో ఎక్కడ ఇబ్బంది లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని లాక్కొస్తున్నారు. దాంతో ముందుగా చంద్రబాబునాయుడు అండ్ కు తర్వాత బిజెపి నేతలకు దిక్కుతోచలేదు. జగన్ ను గబ్బు పట్టించేందుకు వెయిట్ చేస్తున్న పార్టీలకు బొత్స మాటలు అవకాశంగా మారింది.

 

ప్రతీ రోజు రైతులతో మాట్లాడటం, వాళ్ళని రెచ్చగట్టటం రాజధాని మార్పుకు సంబంధించి గోల చేయించటమే పనిగా పెట్టుకున్నాయి. ఇందులో భాగంగా ఉండవల్లి గ్రామం రైతులతో ఆదివారం రచ్చ చేయించారు. రాజధానిని తరలించాలంటే తమ శవాల మీదగానే జగన్ ఆ పని చేయాలంటూ రైతులు  చేసిన గోల ఆశ్చర్యంగా ఉంది.

 

ప్రత్యర్ధులపై బురద చల్లటంలో చంద్రబాబు అయినా టిడిపి నేతలైనా ఆరితేరిపోయిన వారు. ఒకే అంశాన్ని లేకపోతే ఒకే అబద్ధాన్ని ఒకటికి వందసార్లు చెప్పటమే కాకుండా ఎల్లోమీడియాతో సొంతంగా కథనాలు వండి వార్చేట్లు చేయగలరు. దాన్నే జనాలు కూడా నిజమనే భ్రమల్లో పడిపోతారు. ఇపుడు జరుగుతున్నది కూడా అదే. రాజధాని నిర్మాణానికి అమరావతి ఎంతమాత్రమూ పనికిరాదన్న విషయం అందరికీ తెలుసు. ఎంతోమంది నిపణులు ఇదే విషయాన్ని చెప్పినా వినకుండా చంద్రబాబు ఒప్పుకోకుండా ఇక్కడే మొదలుపెట్టారు నిర్మాణాలు.

 

అదే విషయాన్ని మంత్రి బొత్స కూడా గుర్తు చేశారు. నిజానికి మంత్రులు చెప్పినదానిలో తప్పేమీ లేదు. అదే సమయంలో ప్రణాళికా బోర్డుల ఏర్పాటులో భాగంగా జగన్ నాలుగు రాజధానులను ఏర్పాటు చేయబోతున్నట్లు టిడిపి ఫిరాయింపు బిజెపి ఎంపి టిజి వెంకటేష్ చెప్పిన విషయంపై మాత్రం ఎవరూ మాట్లాడటం లేదు. పరిపాలనను వికేంద్రీకరణలో భాగంగానే జగన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని టిజి చెప్పిన విషయానికి చాలామంది జనాల నుండి సానుకూల స్పందన వస్తోంది. అందుకనే ఆ విషయంపై మాత్రం టిడిపి, బిజెపి నేతలు ఏమీ మాట్లాడటం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: