అంతరిక్ష ప్రయోగాలు చేయడంలో ఇండియా మొదటిస్థానంలో ఉన్నది.  ప్రపంచ దేశాలతో ధీటుగా ప్రయోగాలు చేస్తూ దూసుకుపోతున్న ఇండియా ఇటీవలే ప్రయోగించిన చంద్రయాన్ 2 సక్సెస్ అయిన సంఘటిత తెలిసిందే.  సెప్టెంబర్ 7 వ తేదీన చంద్రయాన్ 2 చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలుమోపబోతున్నది.  దక్షిణ ధ్రువంపై కాలుమోపే మొదటి ఉపగ్రహం చంద్రయాన్ 2 కావడం విశేషం.  


ఇప్పటికే ఇండియా అక్కడ నీటి జాడలు కనుగొన్నది.  వాటిని వెలికి తీసేందుకు గాను చేపడుతున్న ప్రయోగంలో చంద్రయాన్ 2 సహకారం అందించబోతున్నది.  భవిష్యత్ అవసరాలకు కావాల్సిన నీరు, ఇతర మూలకాలు దక్షిణ ధృవంలో పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది.  వీటిని వెలికి తీస్తే.. భవిష్యత్ అవసరాలను ఉపయోగపడతాయి.  చంద్రుడిని ఓ మజిలీగా వినియోగించుకొని ప్రయోగాలు చేసేందుకు కావలసిన ఏర్పాట్లు చేసుకుంటోంది ఇండియా.  


త్వరలోనే ఇండియా గగన్ యాన్ చేసేందుకు సిద్ధం అయ్యింది.  గగన్ యాన్ లో చంద్రుని మీదకు మనిషిని పంపించాలని ఇండియా ఉద్దేశ్యం.  దీనికి సంబంధించిన టెక్నాలజీ ప్రస్తుతం ఇండియా వద్ద అందుబాటులో లేదు.  ఇందుకోసం రష్యా సహకారం తీసుకోబోతున్నది.  రష్యా శాస్త్రవేత్తలు ఇండియన్ శాస్త్రవేత్తలకు, వ్యమగాములకు శిక్షణ ఇవ్వబోతున్నారు. 


ఈ శిక్షణతో పాటు కొన్ని రకాల విడిభాగాలను కూడా ఇండియా రష్యా నుంచి దిగుమతి చేసుకోబోతున్నది.  ఇలా విడిభాగాలు దిగుమతి చేసుకుంటే.. వాటిని వినియోగించి గగన్ యాన్ కోసం కావాల్సిన వ్యోమనౌకలను తయారు చేసుకోవచ్చు.  అయితే, ప్రస్తుతం ఇస్రో దృష్టి యావత్తు చంద్రయాన్ 2 మీదనే ఉన్నది.  చంద్రయాన్ 2 సెప్టెంబర్ 7 వ తేదీ అర్ధరాత్రి 1:30 నుంచి 2:30 మధ్యలో చంద్రుని మీదకు లాండర్ ద్వారా లాండ్ కాబోతున్నది.  ఈ మధుర క్షణాల కోసం యావత్ భారత ప్రజలు ఎదురు చూస్తున్నారు.  2021లో గగన్ యాన్ ప్రారంభం అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: