పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది.  ప్రచారం చేసుకోవడానికి సరైన సమయం లేకపోవడం కారణంగా పవన్ పార్టీ ఓటమిపాలైంది.  కర్ణుడు చావుకు సవా లక్ష కారణాలు అన్నట్టు పవన్ కళ్యాణ్ ఓటమికి  కూడా ఇంచుమించుగా అలాంటి కారణాలే ఉన్నాయి.  పార్టీని ఏర్పాటు చేసి ప్రచారం చేసుకునే సమయంలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పార్టీ ఆఫీసులు ఏర్పాటు చేసుకున్నారు.  


గుంటూరులో భారీ ఎత్తున పెద్ద ఆఫీస్ ఏర్పాటు చేశారు.  రావెల కిషోర్ బాబు బీజేపీ నుంచి జనసేనలో చేరడం.. ఆ తరువాత పార్టీ ఓడిపోవడంతో తిరిగి అయన బీజేపీలోకి వెళ్లిపోయారు.  ఇక్కడ పార్టీ ఆఫీసులు అవసరం లేకపోవడంతో.. తిరిగి వాటిని మూసేస్తున్నారు.  ఇప్పటికే చాలా వరకు పార్టీ ఆఫీసులను మూసేశారు.  ఇప్పుడు గుంటూరులో ఉన్న పార్టీ ఆఫీస్ ను కూడా మూసేస్తున్నారు.  


తాడేపల్లి వద్ద ఉన్న సెంట్రల్ ఆఫీస్ ఒక్కటే ప్రస్తుతం అందుబాటులో ఉన్నది.  పవన్ కళ్యాణ్ అక్కడే ఉంటున్నారు.  అక్కడి నుంచే పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నాడు.  పార్టీని ఎలాగైనా నడిపిస్తానని చెప్పిన పవన్, చెప్పినట్టుగానే పార్టీని నడిపిస్తున్నారు. అన్ని విధాలుగా పార్టీని వచ్చే ఎన్నికలకు సిద్ధం చేయాలని పవన్ భావిస్తున్నాడు.  


ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లడమే ఇప్పుడు పవన్ ముందున్న ప్రశ్న.  ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.. ఎలా పార్టీని నడిపించబోతున్నారు అన్నది తెలియాల్సి ఉన్నది. పార్టీని నడిపించాలి అంటే ముందు దానికి నిధుల అవసరం ఉన్నది.  మరి నిధుల కోసం పవన్ పార్టీ ఎలా అనుసరిస్తుంది అన్నది తెలియాల్సి ఉన్నది.  ఒక్కో కార్యాలయం ఇలా మూసేసుకుంటూ పోతుంటే.. చివరకు తాడేపల్లిలో ఉన్నది మినహా మరొకటి ఉండదు.  అందుకే పవన్ ముందుగా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిపెడితే.. ఆ తరువాత పార్టీ నుంచి మద్దతు అదే లభిస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: