క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే అనుమానలు మొదలయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్న రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదు. ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని అందరికీ తెలుసు. కానీ దాన్ని నిరూపించాలంటే అంత ఈజీ కూడా కాదు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబునాయుడు ఏటిఎంలాగ వాడుకుంటున్నారంటూ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడినే ఓ బహిరంగ సభలో ఆరోపించారంటే అర్ధమేంటి ?

 

తాజాగా బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు తో పాటు మాజీ మంత్రి కొండలరావు తదితర నేతలు పోలవరం అథారిటితో సమావేశమయ్యారు. సమావేశం తర్వాత కేంద్రమే ప్రాజెక్టును చేపడితే సరిపోతుందనే అభిప్రాయం వ్యక్తమైందని సమాచారం. అంటే అథారిటి కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని కేంద్రప్రభుత్వానికి ఇచ్చేస్తే అప్పుడు కేంద్ర జలవనరుల శాఖ రంగంలోకి దిగుతుందేమో.

 

 నిజంగా కేంద్రం ఆ పని చేస్తే జగన్ నెత్తిన పాలు పోసినట్లే. ఎందుకంటే ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంటుంది. కాబట్టి రాష్ట్రప్రభుత్వం ప్రాజెక్టు వ్యవహారాల నుండి బయటపడిపోవచ్చు. అయితే ఇక్కడే అందరికీ ఓ అనుమానం పెరిగిపోతోంది. అదేమిటంటే ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు పాల్పడిన  అవినీతి ఎలా బయటకు వస్తుంది ?   ప్రాజెక్టు బాధ్యతల నుండి రాష్ట్రప్రభుత్వం పక్కకు తప్పుకుంటే ఇక దానిలో వేలు పెట్టేందుకు ఉండదు. అప్పుడు చంద్రబాబు చేసిన ఆవినీతి మొత్తం ప్రాజెక్టు పునాదుల్లోనే ఉండిపోతుంది.

 

చూడబోతే జగన్ కు వ్యతిరేకంగా చంద్రబాబు, బిజెపిలు కలిస్తున్నాయా అన్న అనుమానాలకు ఊతమొస్తోంది. ప్రాజెక్టులో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారని మోడి, జగన్ కు ఒకే అనుమానం ఉన్నది. అటువంటప్పుడు జరిగిన అవినీతిని బయటపెట్టటానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం మద్దతివ్వాలి. కానీ వ్యతిరేకంగా నడుచుకుంటోంది. ఇక్కడే అందరికీ కేంద్రం తాజా వైఖరిపై అనుమానులు పెరిగిపోతున్నాయి. చంద్రబాబును రక్షించటం కోసమే పోలవరాన్ని కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటోందా ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: