ఉత్తర కొరియా దూకుడుగా పెంచింది. తన వైఖరితో ఇరుదేశాల మధ్య మైత్రి బెడిసి కొట్టే పరిస్థితులు నెలకొన్నాయి.  ఈనేపథ్యంలో అమెరికా ఒక అడుగు ముందుకు వేసిందనే చెప్పాలి. కొరియా అణు నిరాయుధీకరణ చర్చలను త్వరలో పునఃప్రారంభిచేందుకు ఇరుదేశాలూ ఎదురు చూస్తున్నట్టు వార్తలు వస్తున్న తరుణంలో ఉత్తర.కొరియా ఈ వరుస ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తుండటం విశేషం.దక్షిణ కొరియా నిర్వహించిన సంయుక్త సైనిక విన్యాసాలు ముగిసిన వారం రోజులు కూడా అవలేదు.



ఇంతలోనే ఉత్తర కొరియా కొత్తగా రూపొందించిన బహుళ రాకెట్‌ ప్రయోగ వేదిక (మల్టిపుల్‌ రాకెట్‌ లాంచర్‌)ను  ప్రయోగాత్మకంగా పరీక్షించింది.
అణుచర్చలు పున: ప్రారంభించాలని గత జూన్‌లో జరిగిన ఈ భేటీలో ఇరువురు నేతలూ ఒక అంగీకారానికి వచ్చారు. ఈ రాకెట్‌ ప్రయోగ వ్యవస్థ అత్యంత గొప్పదైన ఆయుధమని కిమ్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. దీని రూపకల్పనలో క్రియాశీలకంగా వ్యవహరించిన శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలియచేసినట్టు అధికార కేసీఎన్‌ఎ వార్తా సంస్థ వెల్లడించింది.




ఈ పరిణామాల నేపథ్యంలో  ఉత్తర కొరియాతో అణు చర్చలను పున: ప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు అమెరికా దౌత్యవేత్త స్టీఫెన్‌ బీగన్‌ ప్రకటించారు. కాగా ఉత్తర కొరియా  అధ్యక్షుడు కిమ్‌జోంగ్‌ ఉన్‌ ఈ ప్రయోగ పరీక్షను స్వయంగా పర్యవేక్షించారని మీడియా తెలిపింది. ఉత్తర.కొరియా ఆదివారం నాటి ప్రయోగంలో రెండు స్వల్పశ్రేణి భాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించినట్టు దక్షిణ.కొరియా సైన్యం చెబుతుండగా..





ఉత్తర.కొరియా మీడియా మాత్రం తమ ప్రభుత్వం 'భారీ స్థాయి మల్టిపుల్‌ రాకెట్‌ లాంచర్‌'ను ప్రయోగించామని ప్రకటించింది. దక్షిణ కొరియాతో కలిసి నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలను ముగించిన మరునాడే అమెరికా దౌత్యవేత్త ఈ ప్రకటన చేయడం విశేషం. గత ఫిబ్రవరిలో వియత్నాంలో ఇరుదేశాల అధ్యక్షులు ట్రంప్‌, కిమ్‌ మధ్య జరిగిన చర్చలు అర్ధంతంగా ముగిసిన తరువాత ఇరువురు నేతలూ పాంగ్యాంగ్‌లో మరోసారి భేటీ అయిన విషయం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: