అన్‌లైన్‌ బ్యాంకింగ్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక రకాల సైబర్‌ నేరాలు జరుగుతున్నాయి.ముఖ్యంగా ఓటీపీ ఫ్రాడ్స్‌ ఊహకందని రీతిలో జరుగు తుంది..అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్‌ వచ్చినా,అచ్చం మనలాంటి నంబర్‌ నుంచి కాల్‌ చేసినా స్పందించొద్దు.వారు చెబుతున్న ఆ విషయం గురించి క్షుణం గా ఆలోచించిన తర్వాతే స్పందించాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని నేరాలకుపాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్లు సరికొత్త పంథాలో మోసాలకు తెగబడుతున్నారు.ఒకే రకమైన మోసాన్ని రకరకాలుగా చేస్తున్నారు.అంతే కాకుండా సైబర్‌ నేరాలపై కొద్దో గొప్పో అవగాహన ఉన్న విద్యావంతులను సైతం బురిడీ కొట్టిస్తుంచి క్షణాల్లోనే బ్యాంక్‌ ఖాతాలోని సొమ్మును ఖాళీచేస్తున్నారు.ఇలా దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో అమాయక ప్రజల నుండి కొన్ని లక్షల రూపాయలు దోచుకుంటున్నారు.




అందుకే అపరితులు చెప్పిన మోసపూరిత మాటలు నమ్మకండి.అత్యాశకు పోయి అనర్థాలు కొనితెచ్చుకోకండి,అని సైబర్‌ క్రైం పోలీసులు చెబుతున్నా అవగాహన సదస్సులు ఎన్నినిర్వహించి సైబర్‌ నేరాల గురించి తెలియజేస్తున్నా.కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నా.ప్రజల్లో మార్పు రావడంలేదు.చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లు అన్న చందంగా...పోలీసుల మాటలను ప్రజలు పెడచెవిన పెడుతున్నారు.సైబర్‌ నేరాలపై అవగాహన పెంచుకోవడంలేదు. అందుకే ఈ సమస్య పోలీసులకు సవాల్‌గా మారింది..ఇక ఇప్పుడొక వ్యక్తి అలానే మోసపోయాడు..




కూకట్‌పల్లికి చెందిన ఓ వ్యక్తి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.ఓ రోజు అతను ఆఫీసులో బిజీగా ఉన్న సమయంలో గుర్తుతెలియని నంబర్‌ నుంచి ఫోన్‌ కాల్‌ రావడంతో లిఫ్ట్‌ చేశాడు. ఆ కాల్ చేసినతను సర్‌..నమస్తే..దయచేసి నేను చెప్పేది వినండి ప్లీజ్‌ అంటూ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అందమైన స్టోరీని వినిపించాడు.సర్‌..ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్‌లో నా ఫోన్‌ నంబర్‌ బదులు పొరపాటుగా మీ నంబర్‌ రాశాను.ఇద్దరిదీ ఒకే రకమైన నంబర్‌ కావడంతో పది అంకెల్లో ఒక అంకెను తప్పుగా రాశాను.నా జాబ్‌ ఆఫర్‌ మెసేజ్‌ నీకు వచ్చిందని తెలిసింది.రిజిస్టర్‌ నంబర్‌కు మాత్రమే మెసేజ్‌ వస్తుందని కంపెనీ వారు అంటున్నారు.ఆ మెసేజ్‌ చూపించమంటున్నారు అంటూ.. ప్లీజ్‌అన్నా..కాస్త ఆ మెసేజ్‌ నానంబర్‌కు ఫార్వార్డ్‌ చేయమన్నాడు.



మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని హుందాగా,కన్విన్సింగ్‌గా మాట్లాడాడు.క్షణాల్లో ఇదంతా జరిగిపోయింది.పని బిజీలో వున్న సాఫ్ట్‌వేరింజనీర్ మెసేజ్‌ను చదువు కోకుండానే అతడి నంబర్‌కు ఫార్వర్డ్‌ చేశాడు.అంతే క్షణాల్లోనే అతడి బ్యాంక్‌ ఖాతాలో ఉన్న రూ. 90వేలు మాయమయ్యాయి.మోసపోయా నని గ్రహించినబాధితుడు తిరిగి అపరిచిత వ్యక్తికి ఫోన్‌ చేయగా స్విచాఫ్‌ వచ్చింది.వెంటనే సైబర్‌ క్రైం పోలీసులను సంప్రదించగా వారు పూర్తివివరాలు సేకరించి ఇది సైబర్‌నేరగాళ్ల కొత్తరకం మోసమని చెప్పారు..ఇంకేముంది జరుగవలసినదంతా జరిగాక లబోదిబో అంటే ఉపయోగం ఉండదు.కాబట్టి తల బాదు కుంటూ ఆ వ్యక్తి ఇంటికెళ్లిపోయాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: