సామాన్య, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలు ఏసీని ఒక ఖరీదైన వస్తువుగానే చూస్తారు. మార్కెట్లో ఏసీ ఖరీదు వేల రుపాయల్లో ఉంటుంది. అంత ఖర్చు చేయటంపై సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆసక్తి చూపించరు. కానీ గుజరాత్ రాష్ట్రంలోని వడోదర ప్రాంతానికి చెందిన మనోజ్ పటేల్ అనే వ్యక్తి అతి తక్కువ ఖర్చుతో ఏసీని తయారు చేసాడు. మనోజ్ పటేల్ ఏసీ తయారు చేయటానికి అయిన ఖర్చు కేవలం 800 రుపాయలు మాత్రమే కావటం విశేషం. 
 
ఈ ఏసీ తయారు చేయటానికి మనోజ్ పటేల్ మట్టికుండను మూలంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. మట్టి కుండలో నీటిని ఉంచినపుడు సూక్ష్మ రంధ్రాల నుండి వెళ్ళే నీరు ఆవిరి అవటం వలన నీరు చల్లగా అవటం తెలిసిన విషయమే. ఇదే పరిఙానాన్ని ఉపయోగించి మనోజ్ పటేల్ ఏసీని తయారు చేసాడు. మనోజ్ తయారు చేసిన ఏసీలో పింగాణీని ఉపయోగించాడు. ప్రస్తుతం మనోజ్ మూడు రకాల మోడల్స్ తో కూడిన ఏసీలను తయారు చేసాడు. 
 
ఒక మోడల్ లో నీటి మోతాదును చెప్పే ఒక సూచికను ఏర్పాటు చేసి ఉండటంతో పాటు ఒక మొక్క పెంచటానికి కూడా ఏర్పాట్లు చేసి ఉంటాయి. మరొక మోడల్ లో విద్యుత్ అవసరం లేకుండా పది డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను తగ్గించే విధంగా ఉంటుంది. మరొక మోడల్ ఏసీలో ఒక ఫ్యాన్ ఉంటుంది. మనోజ్ పటేల్ ఈ ఏసీలను తయారు చేయడానికి ఒక్కో ఏసీకు 800 రుపాయలు ఖర్చు అయినట్లు చెప్పాడు. 
 
సాధారణంగా గుజరాత్ రాష్ట్రంలో వేసవికాలంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు ఉంటాయి. ఈ ఏసీలను గుజరాత్ రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో పంపిణీ చేయాలనే ఆలోచన ఉన్నట్లు మనోజ్ పటేల్ తెలిపాడు. ఈ ఏసీలను బస్టాండ్, రైల్వే స్టేషన్ లాంటి ప్రదేశాలతో పాటు కూరగాయలు, పండ్లు అమ్మేవారు ఉపయోగించటానికి వీలుగా ఉంటుందని మనోజ్ పటేల్ తెలిపాడు. 
 
 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: