ఒక్కఫ్ఫుడు గుంటూరు నగరం నుంచి నవ్యాంధ్ర రాజధాని అమరావతికి వెళ్లే రోడ్ కు సమీసంగా…మరోవైపు విజయవాడ నగరానికి కనెక్టవిటీ కోసం నిర్మించిన ఇన్నర్ రింగ్ రోడ్డులో 4అంతస్తుల జనసేన గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయం చక్కటి ఎక్స్ టీరియర్ డిజైన్ తో…అందంగా తీర్చి అధికారికంగా పవన్‌ కళ్యాణ్‌ ప్రారంభోత్సవం చేసారు. అంతేకాదు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన అభిమానులు,జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చారు,పార్టీకి సంబంధించిన కార్యకర్తల సమావేశాలు కార్యక్రమాలు నిర్వహించడానికి జనసేన కార్యాలయం ఏర్పాటు అయినందుకు గుంటూరు జిల్లా జనసేన పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేసారు.కాని ఇప్పుడు ఆభవనం బార్ అండ్ రెస్టారెంట్ గా మారిందట..విషయమేంటో తెలుసుకుంటే.



ఈ సంవత్సరం మార్చిలో ఎన్నికలకు ముందు ఈ బిల్డింగ్‌లో జనసేన పార్టీ తన కార్యాలయాన్ని ప్రారంభించింది.రావెల కిషోర్‌ బాబు తెలుగుదేశం పార్టీని వీడి, జనసేనలో చేరిన తరువాత,ఆయనే ఈ భవనాన్ని పార్టీ కార్యాలయంగా ప్రారంభించారు.అయితే,అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పరాజయం తరువాత,రావెల ఈఛాయలకు కూడా రాలేదు. ఆయన బీజేపీలో చేరిపోయారు.ఇలా ఇంకొంత మంది నాయకులు కూడా ఈ మధ్యకాలంలో పార్టీని వీడటంతో పలు నియోజకవర్గాల్లోనూ పార్టీ కార్యాలయాలు మూతపడ్డాయి.ఇక ఈ భవనాన్ని యజమానికి అప్పగించగా మర్మతులు చేయించిన ఆ భవన యజమాని భవనాన్ని బార్ అండ్ రెస్టారెంట్ కు అద్దెకిస్తామని బోర్డ్ పెట్టాడుఇప్పుడు ఈ బోర్డ్ ను చూసిన వారందరు .జనసేన పార్టీ కార్యాలయం బార్ అండ్ రెస్టారెంట్ గా మారిందేంటని ఆశ్చర్యపోతూ వింతగా భవనం వైపు చూస్తున్నారు..




ఇక ఈనెల 30,31 తేదీల్లో ఏపీ రాజధాని అమరావతిలో పర్యటిస్తానని హైదరాబాద్‌ జనసేన కార్యాలయంలో రాజధాని రైతులు కలిసిన సందర్భంగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు.రాజధాని పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వారు పవన్‌కు వివరించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు తాను అండగా నిలుస్తానని,రైతుల ఆవేదన తాను అర్ధం చేసుకున్నానని తెలిపారు. ఏపీ రాజధాని అమరావతిని ఎట్టి పరిస్థితిలోనూ తరలించవద్దని ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: