విగ్రహాల విధ్వంస రచన కొనసాగుతుంది. ప్రముఖల విగ్రహాలే లక్ష్యంగా పోకిరీలు దుశ్చర్యకు పాల్పడుతున్నారు. తమిళనాడులో మరోసారి అంబేద్కర్ విగ్రహ ధ్వంసం కలకలం సృష్టించింది. తమిళనాడు వేదారణ్యంలో ఉద్రిక్తత నెలకొంది. కొంత మంది దుండగులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం గొడవకు కారణమైంది. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ ఓ వర్గం ఆందోళనకు దిగింది . ఈ క్రమంలో ట్రాఫిక్ లో రెండు వాహనాలు ఎదురుగా రావడంతో వివాదం తలెత్తింది . ఫలితంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది .


వేదారణ్యంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పది మంది గాయపడ్డారు . ఈ గొడవలో పోలీసు వాహనాలు దగ్ధమయ్యాయి . అగ్రిమాపక సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది . ఉద్రిక్తత తలెత్తడంతో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి . ఇరు వర్గాల్లోనూ పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు . వేదారణ్యంలో ప్రస్తుతం కర్ఫ్యూ కొనసాగుతుంది. విసికె పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపు నిచ్చింది.




మరింత సమాచారం తెలుసుకోండి: