కోడెల కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు చేసిన  దోంగతనాలన్నీ ఇప్పుడు బయటికి వస్తున్నాయి.  తాజాగా ల్యాప్ టాప్ లు మిస్సింగ్ కేసుల్లో  కూడా కోడెల ఫ్యామిలీ ఉన్నట్లు తెలుస్తుంది. అధికారం ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లు చేతి వాటం ప్రదర్శించారు. ఇప్పుడు అడ్డంగా బుక్ అవుతున్నారు. కోడెల చేసిన అక్రమ పనులు .. దరిద్రమైన అవినీతి ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఇప్పటికే కోడెల పై కే టాక్స్ వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఫర్నిచర్ దొంగతనం కేసులో కూడా కోడెల మీద కేసుకు నమోదు అయ్యాయి. అయితే ఒక దాని వెనుక మరొకటి కోడెల అవినీతి చిట్టా ఇప్పుడు బయటికి వస్తున్నాయి. చివరికి పశువులకు వేసే గడ్డిని కూడా వదల్లేదని అర్ధం అవుతుంది.


అయితే గత ప్రభత్వం సైలెజ్ గడ్డి కోసం రైతులకు కేవలం కిలో రు 2 లకు మాత్రమే ఇచ్చింది. అయితే కోడెల ఫ్యామిలీ ఈ గడ్డిని రైతులకు అందకుండా చేసి రూ 2 మాత్రమే చెల్లించి సుమారు 2,800 తన్నుల గడ్డిని మేసేశారు. నిజానికి ఈ గడ్డిని  తమ కుమార్తె కున్న ఔషధాల తయారీ కంపెనీలోకి మల్లించారు. ఇవన్నీ బయటికి వస్తుంటే చివరికి నియోజక వర్గ ప్రజలు కూడా కోడెలను అస్యహించుకుంటున్నారు. అయితే కోడెల వ్యవహారంలో టీడీపీ నోరు మెదపటం లేదు.


అయితే ఇన్ని జరుగుతున్న టీడీపీ పార్టీ నుంచి సపోర్ట్ రావటం లేదు. లోకేష్ గాని చంద్రబాబు గాని కోడెలకు సపోర్ట్ పక్కన పెడితే తప్పు చేస్తే శిక్షించమని చంద్రబాబు చెప్పుకొచ్చారు అంతే గాని కక్ష సాధింపులకు దిగితే సహించేది లేదని చెప్పారు. అంటే బాబు .. కోడెల తప్పు చేశాడని ఒప్పుకున్నట్టే కదా ! అయితే కోడెల పై ఇప్పటికే నియోజక వర్గ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఫర్నిచర్ దొంగతనంలో కేసులో దొరికి పోయేసరికి కోడెల పరువు మొత్తం బజారుకు చేరింది. అడ్డంగా దొరికి పోయిన తరువాత ఇప్పుడు ఫర్నిచర్ ను ఇచ్చేస్తానని కోడెల చెప్పడం ... దీన్ని కోడెలను ఏమనాలో కూడా ప్రజలకు అర్ధం కావటం లేదు. ఇటువంటి ప్రజా ప్రతి నిధి ప్రప్రంచంలో ఎక్కడా కనిపించడని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ల్యాప్ టాప్ లు కేసులో కూడా కోడెల ఫ్యామిలీ హస్తం ఉండటంతో పరువు మొత్తం బజారున పడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: