దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఇలా ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ లో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. పంజాబ్, హర్యాణా, ఢిల్లీల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. రాజస్థాన్ నుండి మాన్ సూన్ ట్రెఫ్ మధ్యప్రదేశ్ మీదుగా బంగాళాఖాతం దాకా ఉంది. దీంతో రాజస్థాన్ లో చాలా వరకు మోస్తరు వర్షాలు, గుజరాత్ లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఇటు మధ్యప్రదేశ్ లో సైక్లోనిక్ సర్క్యులేషన్ కొనసాగుతుంది.



ఈ ప్రభావంతో మధ్యప్రదేశ్ లో చాలా చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ఛత్తీస్ ఘర్, ఒడిశాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జార్ఖండ్, బీహార్ లో తేలికపాటి నుండి సాధారణమైన వానలు పడుతున్నాయి. ఇటు తూర్పు భారతదేశంలో చూసుకుంటే నాగాలాండ్ లో సైక్లోనిక్ సర్క్యులేషన్ కొనసాగుతుంది. ఈ ప్రభావంతో సిక్కిం, అస్సాంలో తేలికపాటి మరియు మేఘాలయ, నాగాలాండ్ లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇటు మహారాష్ట్రలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా దక్షిణ భారత విషయం చూసుకుంటే గనక కర్ణాటక, కేరళ లో అక్కడక్కడా భారీ వానలు పడుతున్నాయి.


తమిళనాడు లో చూస్తే తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో మళ్లీ వర్ష ప్రభావం తగ్గింది. ప్రస్తుతం తెలంగాణలో మోస్తరు వానలు పడుతున్నాయి. అత్యధికంగా సూర్యాపేటలో నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ లో ముఖం చూపించినట్లే చూపించి మళ్లీ దాక్కొంది వర్షం. కాని ఒక వెస్ట్ మారెడ్ పల్లిలో అయితే నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంకా ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే ఓ మోస్తర్ నుండి ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళంలో అత్యధికంగా పదకొండు సెంటీమీటర్ల వర్షపాతం మరియు రాయలసీమలో వర్ష ప్రభావం తగ్గు ముఖం పట్టి తేలికపాటి జల్లులు పడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: