జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిబిఐ మొదటి కేసు టేకప్ చేయటానికి సమయం వచ్చిందా ? తాజాగా హై కోర్టు చేసిన సూచనలతో అందరిలోను అదే అనుమానం మొదలైంది.  టిడిపి నేతలపై జరుగుతున్న దాడులతోను, అరెస్టుల భయంతోనే  రాష్ట్రంలోకి సిబిఐని అడుగుపెట్టనీయకుండా  చంద్రబాబునాయుడు గతంలో రెడ్డ సిగ్నల్ చూపించిన విషయం తెలిసిందే.

 

సరే జగన్ సిఎం కాగానే సిబిఐని రాష్ట్రంలోకి అనుమతిస్తు ఉత్తర్వులు జారీ చేసిన విషయం కూడా తెలిసిందే. ఎప్పుడైతే సిబిఐ ఎంట్రీకి అనుమతి దక్కిందో వెంటనే జనాలకు రెండు కేసులపై ఆలోచన మళ్ళింది. మొదటిది జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసు. రెండోది పోలవరం అవినీతి వ్యవహారం. ఈ రెండింటి మీద సిబిఐ విచారణకు జగన్ ప్రభుత్వం ఢిల్లీకి సిఫారసు చేస్తుందని అందరూ ఊహించారు.

 

కానీ అందరి అంచనాలను తల్లక్రిందులు చేస్తు రెండు అంశాలపైన జగన్ సిబిఐ విచారణ గురించి ఆలోచించినట్లు కనబడలేదు. అయితే హఠాత్తుగా టిడిపి మాజీ ఎంఎల్ఏ యరపతినేని శ్రీనివాస్ రావు అక్రమ మైనింగ్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. మైనింగ్ లో వందల కోట్ల రూపాయల అక్రమాలు, అవినీతి జరిగిందని చెప్పిన హై కోర్టు సిబిఐతో విచారణ చేయించే విషయంపై రాష్ట్రప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

 

నిజానికి టిడిపి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని యరపతినేని మైనింగ్ పేరుతో అడ్డదిడ్డంగా దోచుకునేశారు. యరపతినేని దోపిడికి చంద్రబాబునాయుడు, లోకేష్ సంపూర్ణ మద్దతుందని వైసిపి నేతలు ఎప్పటి నుండో ఆరోపిస్తున్నారు.  మైనింగ్ కుఅడ్డు వచ్చిన వాళ్ళని, తన వ్యవహారాలపై ఫిర్యాదులు చేసిన వారిని యరపతినేని ఎన్నోరకాలుగా ఇబ్బందులు పెట్టేవారని బాధితులు మండిపోతుంటారు. అధికారంలో ఉన్నంత కాలం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన యరపతినేనికి ఇపుడు కష్టాలు మొదలయ్యాయి. యరపతినేని తగులుకుంటే ఆయన్ను వెనకనుండి నడిపించిన వాళ్ళు కూడా బయటపడతారేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: