ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రోజుకో సంచలన నిర్ణయం తీసుకొని చరిత్ర సృష్టిస్తున్నారు. ఈ తరహాలోనే మరో సంచలన నిర్ణయం తీసుకొని ప్రజలకు షాక్ ఇచ్చారు సీఎం జగన్.  గతంలో విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఈ సందర్బంగా ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం పై విద్యార్థుల తల్లిదండ్రులు పడుతున్న పాట్లకు కాస్త ఉపశమనం లభించనుంది. 


వివరాల్లోకి వెళితే  పాఠశాలల్లోనే  15 ఏళ్ల లోపు పిల్లలకు ఆధార్‌ నమోదు, అప్‌డేషన్‌ చేసేందుకు ఏపీ సర్కార్ సిద్దమవుతోంది. ఇందులో భాగంగా గుంటూరు, ప్రకాశం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. సెప్టెంబర్‌ 1 నుంచి గుంటూరు జిల్లాలోని పాఠశాలల్లో ఆధార్‌ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. 


ఈ కార్యచరణకు సంబంధించి అధికారులు ఇప్పటికే ప్రాణాళికను కూడా సిద్దం చేశారు. పైలట్ ప్రాజెక్ట్ కు ఎంపికైన నాలుగు జిల్లాల్లో మండలానికి ఇద్దరు ఉపాధ్యాయుల చొప్పున ఆగస్టు 27వ తేదీన శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటనలో స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపుగా పాఠశాలలోనే పిల్లల వేలిముద్రలను ఆధార్‌లో అప్‌డేట్‌ చేస్తారు.                                                                      


దీని వల్ల ఈకేవైసీ కోసం పోస్టాఫీసులు, బ్యాంకులు, మీసేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాసే తల్లిదండ్రుల కష్టాలకు చెక్ పెట్టినట్లే అని పలువురు భావిస్తున్నారు.  అవకాశం ఉంటోంది. దీంతో చిన్నతనంలో ఆధార్‌ పొందిన వారికి వేలిముద్రల అవసరం పడుతోంది. ప్రభుత్వ నిర్ణయంతో గుంటూరు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 6.5 లక్షల మందికి పైగా విద్యార్థులకు మేలు చేకూరనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: