బెంగళూరు నగరంలోని ప్రజలకు రోబో రెస్టారెంట్లు అందుబాటులోకి వచ్చాయి. కోయంబత్తూరు, చెన్నైలలో రోబో రెస్టారెంట్లు ఇప్పటికే ప్రారంభమై విజయవంతం అయ్యాయి. బెంగళూరు నగరంలో ఇందిరానగర్ హై స్ట్రీట్ లో కొన్ని రోజుల క్రిందట రోబో రెస్టారెంట్ ప్రారంభమైంది. ప్రతి రంగంలోను టెక్నాలజీ వలన విప్లవాత్మకమైన మార్పులొస్తున్నాయి. రెస్టారెంట్ రంగంలో కూడా వడ్డించే రోబోల రాకతో మార్పులు వస్తున్నాయి. 
 
ఈ రెస్టారెంట్లో ఇండియా వంటకాలు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. మనం ఏదైనా రెస్టారెంట్ కు వెళితే బేరర్ ను పిలుస్తాం. కానీ ఇక్కడ మాత్రం ఎవరినీ పిలవాల్సిన అవసరం లేదు. ప్రతి టేబుల్ మీద కస్టమర్ల కోసం ఒక స్మార్ట్ ట్యాబ్ అందుబాటులో ఉంటుంది. స్మార్ట్ ట్యాబ్ లో మనకు నచ్చిన ఐటమ్స్ ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఆర్డర్ చేసిన ఐటమ్స్ ను రోబోలు మన టేబుల్ దగ్గరకు తీసుకొనివస్తాయి. 
 
ఆర్డర్ తీసుకొనిరావటంతో పాటు రోబోలే వినియోగదారులకు ఆహార పదార్థాలను వడ్డిస్తాయి. ఈ రెస్టారెంట్లో మొత్తం ఆరు రోబోలు ఉన్నాయి. పుట్టినరోజు, పెళ్ళిరోజు లాంటి సందర్భాలలో ఈ రోబోలు పాటలు కూడా పాడి కస్టమర్లకు శుభాకాంక్షలు తెలుపుతాయి. కొన్ని రోజుల క్రితం ప్రారంభమైన ఈ రెస్టారెంట్ కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రోజు రోజుకు ఈ రెస్టారెంట్ కస్టమర్లతో రద్దీగా మారింది. 
 
ఈ రోబోలు అందిస్తున్న సేవలు కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. బెంగళూర్ ప్రజలు ఈ రెస్టారెంట్ ను ఆదరిస్తారన్న నమ్మకం ఉందని ఈ రెస్టారెంట్ వ్యవస్థాపకుడు వెంకటేష్ రాజేంద్రన్ చెప్పారు. హైదరాబాద్ నగరంలో కూడా కొన్ని నెలల క్రితం రోబో రెస్టారెంట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ రోబోలకు రోజుకు మూడు గంటల పాటు చార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది.భవిష్యత్తులో మరిన్ని రెస్టారెంట్లలో వడ్డించే రోబోలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: