మియాపూర్ ఆటో డ్రైవర్ హత్య కేసును చేదించారు పోలీసులు. ఆర్ధిక లావాదేవీలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. ఎన్నో ట్విస్టులతో సాగిన ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ హత్య కుట్ర లో ఓ మహిళ కూడా భాగమైంది. ఈ నెల ఇరవై మూడు న దీప్తి శ్రీ నగర్ ధర్మపురి క్షేత్రం వద్దా ఆటో డ్రైవర్ ప్రవీణ్ ను దారుణంగా చంపారు . ప్రవీణ్ ని అతడి స్నేహితులే హత్య చేశారని తేల్చారు పోలీసులు . వరంగల్ జిల్లాకు చెందిన గడ్డం ప్రవీణ్ స్థానికగా ఎంఎ నగర్ లో నివసిస్తున్నాడు. ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు.


స్థానికంగా అడ్డా మీద ఆటో నడిపే వాళ్లకు రోజువారి చిరు వ్యాపారస్తులకు వడ్డీలకు డబ్బులు ఇచ్చేవాడు ప్రవీణ్. ఈ క్రమంలో అతడి దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకున్నారు అతడి  స్నేహితులు శ్రీనివాస్, శ్రీకాంత్. రోజు డబ్బులివ్వమని ప్రవీణ్ స్నేహితులను అడిగేవాడు. అధిక వడ్డీ వసూలు చేస్తున్నాడని విసుగు చెందిన శ్రీనివాస్, శ్రీకాంత్ ఎలాగైన ప్రవీణ్ ని అంతమొందించాలని స్కెచ్ వేశారు. 


అనుకున్న పథకం ప్రకారం వేరే వ్యక్తిని చంపుదామని ప్రవీణ్ ను నమ్మించారు అతని మిత్రులు. ప్రవీణ్ కు ఫుల్ గా మద్యం తాగించి తర్వాత అతనినే హత్య చేశారు నిందితులు. నిందుతుల్లో స్వాతి అనే మహిళ కూడా ఉంది. ఈ హత్య కేసును రెండ్రోజుల్లోనే చేదించారు పోలీసులు. నిందితులు శ్రీకాంత్, శ్రీనివాస్, స్వాతిని అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.


కేసు చేదించిన సిబ్బందిని అభినందించారు డిసిపి వెంకటేశ్వర రావు. నిందితులైన  శ్రీకాంత్ యాదవ్ , శ్రీనివాస్ , స్వాతి ఈ ముగ్గురు నేరస్తులను కూడా నిన్న అరెస్ట్ చేసి ఈ రోజు కోర్ట్ ముందుకి తీసుకు వెళ్ళామని ఎసై తెలిపారు. ఎంతో అన్యోన్యంగా ఉండే స్నేహితులను డబ్బు విడదీసింది. ఆర్ధిక లావాదేవీల కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: