పీ సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ఆశ వర్కర్ లు బ్రాందీ షాపు లేబర్స్ పిలుపునివ్వటంతో తాడేపల్లిలో పోలీసులు భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. జగన్ నివాసానికి వెళ్లే మార్గాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.జగన్ మోహన్ రెడ్డి నివాసాన్ని ముట్టడిస్తామని బ్రాందీ షాపుల్లో ఇప్పటి వరకు పని చేస్తున్న కార్మికులు తెలియ చేశారు.


దీనికి సంబంధించి పోలీసు యంత్రాంగం కూడా పూర్తిస్థాయిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. సీఎం ఈ ఉదయమే డిల్లీ ప్రయాణమై వెళ్ళటం జరిగింది. ఢిల్లీలో ఎక్స్ ట్రిమిస్ట్స్ యాక్టివిటీస్ కు సంబంధించి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రధానంగా చర్చించచున్న పరిస్థితి అయితే ఉంది.


  దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారు. అయితే ఇదే సమయంలో ఢిల్లీ వెళ్లినప్పటికీ కూడా సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని బ్రాందిషాపుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు చెప్పిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఎక్సైజ్ నూతన పాలసీకి సంబంధించి బ్రాందీ షాపులను ఇక పై ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పి బ్రాందీషాపులకు కూడా కోత విధించి మరోవైపు అందులో పని చేసే వారికి నిర్ణీతమైనటువంటి విద్యార్హత పెట్టడంతో వారంతా కూడా ఆందోళన బాట చెయ్యడానికి సీఎం నివాసానికి చేరుకునే ప్రయత్నం చేస్తారని భావిస్తున్న పోలీసులు దానికి సంబంధించి విజయవాడ వారధి వద్ద పూర్తిస్థాయిలో వస్తున్నా, వెళుతున్న వాహనాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తనిఖీ చేస్తున్నారు. ఇదే సమయంలో అటు ఆశా వర్కర్ లు కూడా నిరసనను తెలియజేయడానికి వస్తున్నారు విజయవాడ. ధర్నా చౌక్ అని చెబుతున్న నేపథ్యంలో వారిని కూడా ధర్నా చౌక్ కు మాత్రమే వెళ్లే విధంగా డైవర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది.


ఆశ వర్కర్ లు కూడా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పాద యాత్ర సందర్భంగా తమకు ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి స్థాయిలో నెరవేర్చాలని వారు కూడా ఆందోళన బాట చేపడుతున్నారు. వాళ్ళందరూ కూడా వందలాదిగా ధర్నా చౌక్ చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రెండు అంశాల పైన కూడా పూర్తిస్థాయిలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒక వైపు ఆశా వర్కర్ లు మరొకవైపు ఈ బ్రాందిషాపుల్లో పనిచేసేటటువంటి అన్ స్కిల్డ్ లేబర్ అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొనసాగించాలి.డిగ్రీ అదే విధంగా ఇంటర్ విద్యార్హతతో తమకు ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి తమ చదువులు చదవలేదు కాబట్టి ప్రస్తుతం బ్రాందీ షాపులో పని చేస్తున్న వాళ్లు యథావిథిగా తీసుకోవాలని వాళ్లంతా కూడా డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి నివాసానికి కొంతమంది కార్మికులు కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది.


అయితే వాళ్ళందరని కూడా అక్కడి నుంచి విజయవాడ బస్టాండ్ కు అదే విధంగా ధర్నా చౌక్ కు తరలించిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఎవరైనా వస్తారా అనే అనుమానంతో పోలీసులు పూర్తిస్థాయిలో పటిష్ట భద్రత బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు సీఎం నివాసానికి వెళ్లే దారి అయినటువంటి కృష్ణాజిల్లా నుంచి సీఎం నివాసానికి వెళ్లే దారి అయినటువంటి ఈ వారధి వద్ద పూర్తి స్థాయిలో తనిఖీలు అయితే మాత్రం కొనసాగిస్తున్నారు. ఈ మధ్యాహ్నం వరకు కూడా తనిఖీలు కొనసాగుతాయని పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: