వీకెండ్ వచ్చిందంటే చాలు విశాఖ వాసులంతా బీచుల్లో వాలిపోతారు. అయితే ఈ బీచ్ లు ఎంత ఆనందాన్ని ఇస్తాయో అప్పుడప్పుడు అలలు ప్రాణాలు కూడా తీస్తుంటాయి. అయితే ఇప్పుడు అలలు మాత్రమే కాదు ఆహ్లాదం కోసం బీచ్ కి వస్తే బస్సులూ, బైకులు కూడా ప్రాణాలు తీసేస్తున్నాయి. ఓవర్ స్పీడ్ తో పాటు డౌన్ రోడ్లు కావడంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. విశాఖ నగరం అనగానే అందరికీ ముందుగా బీచ్ లే గుర్తుకొస్తాయి.


నగరానికి ఒక వైపు సరిహద్దుగా వుండే బీచ్ కి ప్రతి రోజు వేల మంది పర్యాటకులు వస్తుంటారు. ఇక వీకెండ్స్ రోజుల్లో అయితే ఆ సంఖ్య డబల్ అవుతుంది. అయితే బీచ్ కు చేరుకునేందుకు ఉన్న రోడ్లు ఇప్పుడు ప్రాణాలు తీసే రహదారులుగా మారాయి. బీచ్ ఆహ్లాదాన్నిస్తే, బీచ్ రోడ్డు మాత్రం ప్రాణాలు తీస్తుందంటున్నారు పర్యాటకులు. విశాఖ బీచ్ లలో అందరికీ నచ్చేది ఆర్ కే బీచ్ నుంచి వుడా పార్కు వరకు ఉండే ప్రదేశమే.


ఇక్కడికి చేరుకునేందుకు కలెక్టర్ కార్యాలయం రోడ్డు, ఏయూ రోడ్డు తాజ్ హోటల్ రోడ్డు, పాండురంగ స్వామి టెంపుల్ రోడ్డు, సబ్ మెరైన్ మ్యూజియం రోడ్డు నుంచి రావాల్సిందే ఇవన్నీ కూడా ఎత్తయిన ప్రదేశం నుంచి బీచ్ కి వేసిన డౌన్ రోడ్డులు కావడంతో ప్రమాదాలకు ఎక్కువ కారణమవుతున్నాయి.


విశాలంగా ఉండే బీచ్ రోడ్డు మీద బైకర్ లు ముఖ్యంగా యువత ఓవర్ స్పీడ్ తో వెళుతూ సందర్శకుల ప్రాణాలు తీస్తున్నారు. ఇక్కడే బైక్ రేసులు పెట్టుకోవడం, వేగంగా వెళుతూ సందర్శకులను భయాందోళనకు గురి చేయడం లాంటివి చేస్తున్నారు. దీంతో సరదాగా బీచ్ లో గడిపేందుకు వస్తున్న వారికి సరదా కాస్త భయంగా మారుతోంది. బీచ్ రోడ్డుకు రావడానికి ఉన్న మార్గాలన్నింటిలోనూ పోలీసులు స్పీడ్ చెక్ చేసే విధంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు జనం. అలాగే బైక్ రేసర్లకు క్రేజీ థింగ్స్ చేసే యువతకు బీచ్ రోడ్డులో పోలీసింగ్ పెంచి, చెక్ పెట్టాలంటున్నారు. కఠిన చర్యలు తీసుకొని బీచ్ కు వచ్చే పర్యాటకులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. బీచ్ రోడ్ లో పర్యాటకుల ప్రాణాలు రిస్క్ పెట్టే విధంగా ఉండకూడదంటే నిబంధనలు కఠినతరం చేయాలని కోరుతున్నారు పబ్లిక్.


మరింత సమాచారం తెలుసుకోండి: