పట్టాలు  ఎక్కబోతున్న  ప్రైవేట్ రైలు

 భారతీయ రైల్వే లో మరో అధ్యాయం మొదలు కానుంది.   ఇప్పటివరకు ప్రభుత్వ పరమైన ఉన్నా రైల్వేలు ఇక నుంచి  ప్రైవేటు వారు కూడా ఆపరేట్ చేసేలా కనిపిస్తుంది. త్వరలో ఈ ప్రైవేటు రైళ్లు పట్టాలు  ఎక్కబోతున్న ట్లు వినికిడి.

అత్యాధునిక హంగులతో  త్వరలో ఢిల్లీ లక్నో  మధ్య తొలి ప్రైవేటు రైలు  ప్రారంభం కానున్నట్లు భోగట్టా.  ఈ రైళ్లలో ప్రయాణికులకు అన్ని రకాల వసతులు సమకూర్చి,  విమానాల తరహా లో సౌకర్యాలు కల్పించ నున్నట్లు తెలుస్తోంది.   ఒక వేళ ఆలస్యమైతే తదనుగుణంగా పరిహారం కూడా చెల్లించాలని ప్రతిపాదన పరిశీలిస్తున్నారు.   ప్రయాణికుల ఆహార సౌకర్యం కొరకు ప్యాంట్రీ కారు, మరియు ఉచిత కాఫీ లేదా తేనీరు సౌకర్యం కూడా ఈ రైళ్ల లో ప్రయాణించే  వారికి అందించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నవి.

 ఇక ఈ రైలు  టికెట్ ధర శతాబ్ది ఎక్స్ప్రెస్ ధరకు  దగ్గరలో ఉండే అవకాశం ఉందంట. సౌకర్యాల పరంగా  అత్యున్నత స్థాయిలో ఉన్న ఈ రైలు ప్రయాణికుల ఆదరాభిమానాలు చూర గొని  అత్యద్భుతం గా నడుస్తుందని రైల్వే వర్గాలు ఎంతో ఆశ తో ఉన్నాయి. ఈ రైళ్లను ప్రారంభించడం ద్వారా మన రైళ్లు మరియు రైల్వే శాఖ  ప్రపంచం స్థాయి ఉత్తమ రైల్వే సర్వీసులు అందించే విధంగా మారిపోతుందని రైల్వే శాఖ భావిస్తున్నది.

తేజస్ గా నామకరణం చేసిన ఈ రైళ్లు అతి త్వరగా    పట్టాలు ఎక్కాలని మన దేశ ప్రజలు కూడా ఆకాంక్షిస్తున్నారు అనడంలో  ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వం అతి త్వరలోనే ఈ తేజస్ రైలు యొక్క సోనాలిక పూర్తి చేసి మన ఆశలు తీరుస్తుందని  అనుకుందాం



మరింత సమాచారం తెలుసుకోండి: