ఇటీవల ఏపీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి బీజేపీ దూకుడు ప్రదర్శిస్తుంది. ఒకశాతం ఓట్లు సంపాదించుకోలేకపోయిన కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడంతో ఏపీలో బలపడాలనే లక్ష్యంగా రాజకీయాలు చేస్తోంది. ఈ క్రమంలోనే పలువురు టీడీపీ నేతలనీ పార్టీలోకి తీసుకుంది. ఇది పార్టీకి ఉపయోగకరమైన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణకు మాత్రం నష్టమే కలిగించేలా ఉంది. పార్టీలో చేరిన కొందరు టీడీపీ నేతలు పాత బీజేపీ నేతలనీ డామినేట్ చేస్తూ దూకుడు మీదున్నారు.


ముఖ్యంగా ఎంపీలు సుజనా చౌదరీ, సీఎం రమేశ్ ల డామినేషన్ మామూలుగా చేయట్లేదు. పార్టీ మొత్తానికి తామే హెడ్ లు అన్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరు కన్నా పోస్టుకి ఎర్త్ పెడుతున్నట్లు కనిపిస్తోంది. అంగబలం, అర్ధబలం గల ఈ నేతలు పార్టీ అధ్యక్ష పదవిపై కన్నేసినట్లు అనిపిస్తోంది. అందులో సుజనా చౌదరీ కన్నాని పక్కకి తప్పించి అధ్యక్ష పీఠం అధిరోహించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.  అందుకే ఆయన ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్న వెంటనే ప్రెస్ మీట్ పెట్టేసి విమర్శలు చేసేస్తున్నారు.


పైగా అధిష్టానం కూడా ఏపీ అధ్యక్షుడుని మార్చాలని యోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో కన్నా లక్ష్మినారాయణ తన పోస్టుకు ఎర్త్ పెట్టకుండా ఉండేందుకు దూకుడు ప్రదర్శిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా అధికార వైసీపీ, సీఎం జగన్ లపై విమర్శనస్త్రాలు సంధిస్తున్నారు. కాకపోతే కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరాల్సిన కన్నా బీజేపీలో చేరి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు.  అయితే వైఎస్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న కన్నాకు జగన్ తో మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడూ చంద్రబాబుని, టీడీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. కానీ వైసీపీ, జగన్ పై పెద్దగా విమర్శలు చేయలేదు.


ఇక ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లో కూడా  జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయలేదు. కానీ ఎప్పుడైతే టీడీపీ నేతలు బీజేపీలో చేరారో అప్పటి నుంచి కన్నాకు భయంపట్టుకుంది. ఎక్కడ తన పోస్టుకు ఎర్త్ పెట్టేస్తారో అని వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అధిష్టానం ఎక్కడ సుజనా, సీఎం రమేశ్ లకు ప్రాధాన్యత ఇచ్చేస్తుందేమో అని భయపడి కన్నా వైసీపీపై యుద్ధం ప్రకటించారు. మొత్తానికి కన్నా తన పోస్టుకు ఎర్త్ పెట్టకుండా ఉండేందుకు దూకుడుగా ముందుకు వెళుతున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: