మనిషిని సమూలంగా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న వ్యసనాలలో ఒకటి ధూమపానం. కానీ  జీవనశైలిలో భాగంగా ప్రత్యక్ష మరియు పరోక్ష ధూమపానం అనేది సర్వసాధారణమైపోయిన అంశంగా తయారవుతూ ఉంది. ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఇది శరీరాన్ని, మనసును మాత్రమే కాకుండా, మీ అందానికి కూడా ఊహకు అందని నష్టాన్ని కలుగజేస్తుంది. క్రమంగా ధూమపానం మీ రూపురేఖలు మరియు మీ లుక్ ని పూర్తిగా మార్చివేయగలదు.


ధూమపానానికి అలవాటు పడిన వ్యక్తి దాని నుండి బయట పడటానికి కష్టంగానే ఉంటుంది. ముఖ్యంగా ధూమపానం ఆరోగ్యం మీద మాత్రమే కాకుండా, అందం మీద కూడా హానికర ప్రభావాలను చూపుతూ క్రమంగా ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. సకాలంలో గుర్తించక పోతే ఇది మానసిక స్థాయిలను ప్రభావితం చేస్తూ, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలకు కారణంగా మారుతుంది. ధూమపానం చేయడం వల్ల మీ వయస్సు కన్నా పెద్దవారిలా కనిపించేలా చేయగల ఒక అసాధారణమైన అలవాటు.


దీని వల్ల వృద్దాప్య ఛాయలు,మొటిమలు,జుట్టు రాలడం,దంతక్షయం లాంటి తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుంది. ధూమపానం చేయడం వల్ల నష్టం తప్ప ఉపయోగాలు ఏమీ లేవు. సిగరెట్లో ఉండే నికోటిన్ మీ చర్మానికి రక్తం ప్రవాహాన్ని దారుణంగా తగిస్తూ క్రమంగా చర్మానికి తగినంత ఆక్సిజన్ మరియు పోషకాలు అందక స్కిన్ ఏజింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ధూమపానం చేయడం వల్ల అధికంగా మొటిమలు వచ్చే అవకాశం ఉంది. విటమిన్ ఇ లెవల్స్ ని తగ్గిస్తుంది.


ధూమపానం చేయడం వల్ల ఎదురయ్యే సమస్యలో అతి ప్రధానమైన సమస్య పెదాల రంగు ముదురు నలుపు లోకి  మారతాయి. ధూమపానం మీ చర్మం యొక్క నీటిస్థాయిని తగ్గిస్తూ డార్క్ సర్కిల్స్  సమస్యకి కారణం అవుతుంది. పొగతాగడం వల్ల చేతి వేళ్ల మీద కూడా  తీవ్రమైన  ప్రభావాన్ని చూపుతుంది. ధూమపానం చేయడం వల్ల చర్మానికే కాదు జుట్టు మిద కూడా ప్రభావాన్ని చూపుతుంది. పొగాకులో ఉండే విష రసాయనాల వల్ల జుట్టు కుదుళ్ళకు హాని కలిగిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: